పాలకుర్తి టౌన్: టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖతో కలిసి శనివారం గీసుకొండ మండలంలోని కోటగండి మైసమ్మ, సాయిబాబా ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి, సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఝాన్సీరెడ్డిని కొండా సురేఖ స్వామివారి శేషవస్త్రం, చీరతో సత్కరించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
ఎన్నిక
జనగామ: అగ్నిమాపక సిబ్బంది అసోసియేషన్ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎం.కనకం మల్లేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎలక్షన్లు జరిగాయి. నూతన కార్యవర్గంలో జిల్లా ఉపాధ్యక్షుడిగా బి.జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా పి.సందీప్ కుమార్‌రెడ్డి, కోశాధికారిగా యు.రవి, సహాయ కార్యదర్శిగా ఎల్.ఐలయ్య, జిల్లా సలహాదారుగా జె. ప్రశాంత్ ఎన్నికై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గానికి పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజా పోరాటాలతోనే ‘మెడికల్ కళాశాల’
జనగామ రూరల్: ప్రజా పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే జనగామలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడం జరిగిందని హైకోర్టు న్యాయవాధి సాదిక్ అలీ అన్నారు. శనివారం బాణాపురంలోని ఓ కళాశాల ప్రాంగణంలో సాదిక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జనగామకు మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది అనే అంశంపై విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ మంగలంపల్లి రాజు, ఆర్టీఏ సభ్యుడు అభి, తుంగ కౌశిక్, ఆసర్ల సుభాష్, బోడ రమేష్, సురేష్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.


