జనగామ రూరల్: జిల్లా వ్యవసాయ శాఖకు సంబంధించి దీప్తి ఇంజినీరింగ్ అండ్ వెల్డింగ్ వర్క్స్ సంస్థ యజమాని కత్తుల రాజిరెడ్డి దాఖలు చేసిన క్లెయిమ్ ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని, శాఖ తరపున లేవనెత్తిన అభ్యంతరాలు విచారణలో ఉన్నాయని డీఏఓ అంబికా సోనీ శనివారం ప్రకటనలో తెలిపారు. ఫెసిలిటేషన్ కౌన్సిల్ రూ.5,25,500 చెల్లించాలని అవార్డు జారీ చేసింది. దీనికి వడ్డీ రూ.13,19,428 కలిపి మొత్తం రూ.18,44,928 చెల్లించాలని క్లెయిమ్ చేస్తున్నారు. అయితే, అవార్డు మొత్తంలో ప్రస్తుత జనగామ జిల్లాకు సంబంధించి రూ.1,38,650 మాత్ర మే కాగా, రూ.3,86,850 సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మొత్తం. అయినప్పటికీ మొత్తం క్లెయిమ్‌కు సంబంధించి జనగామ జిల్లా వ్యవసాయ అధికారి ఒక్కరిపైనే ఎగ్జి క్యూషన్ పిటిషన్ దాఖలు చేశారని శాఖ తరఫున లేవనెత్తిన అభ్యంతరా ల పై ఇంకా నిర్ణయం వెలు వడలేదని స్పష్టం చేశారు.


