పీడీఎఫ్‌ అభ్యర్థి సత్యనారాయణకే సీపీఎం మద్దతు | - | Sakshi
Sakshi News home page

పీడీఎఫ్‌ అభ్యర్థి సత్యనారాయణకే సీపీఎం మద్దతు

Nov 29 2026 1:28 PM | Updated on Nov 29 2026 1:28 PM

● మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

జనగామ రూరల్‌: నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న, కౌన్సిల్‌లో ప్రశ్నించే వ్యక్తి పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి న్యాయవాది కొల్లి సత్యనారాయణ అని, ఆయనకే సీపీఎం మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని కామాక్షి ఫంక్షన్‌హాల్‌ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన జనగామ, సిద్దిపేట మండలాల ఉమ్మడి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడారు.జి.నాగయ్య, ఎండీ అబ్బాస్‌, రాపర్తి రాజు, సాంబరాజు యాదగిరి, సింగారపు రమేష్‌, రాపర్తి సోమయ్య, బొట్ల శేఖర్‌, రాళ్ళబండి శశిధర్‌, శెట్టిపల్లి సతీరెడ్డి పాల్గొన్నారు.

విద్యుత్‌ చోరీకి పాల్పడితే చర్యలు

స్టేషన్‌ఘన్‌పూర్‌: ఏకులానికి, ఏ వర్గం వారికి ఉచిత విద్యుత్‌ లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వీస్‌ నంబర్‌ కల్గి ఉండి అర్హత ఉన్న వారికి మాత్రమే ఉచిత విద్యుత్‌ పథకాలు వర్తిస్తాయని, ఎవరైనా విద్యుత్‌ చోరీకి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని విద్యుత్‌శాఖ స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏఈ శంకర్‌ అన్నారు. ఘన్‌పూర్‌లో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కరెంటు తీగలకు గాని, సర్వీస్‌ వైర్లు కట్‌ చేసి గాని మీటర్‌ లేకుండా విద్యుత్‌ను దొంగతనంగా వాడటం విద్యుత్‌ చట్టం ప్రకారం నేరమన్నా రు. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన వారికి మాత్రమే ఉచిత విద్యుత్‌ పథకం వర్తి స్తుందని ప్రజలు గమనించాలని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement