వడ్లకొండలో విద్యుత్‌ ఉపకేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

వడ్లకొండలో విద్యుత్‌ ఉపకేంద్రం ప్రారంభం

Nov 29 2026 1:28 PM | Updated on Nov 29 2026 1:28 PM

జనగామ: జనగామ డివిజన్‌ పరిధిలోని జనగామ రూరల్‌ సెక్షన్‌లో నూతనంగా నిర్మించిన వడ్లకొండ 33/11 కేవీ విద్యుత్‌ ఉపకేంద్రాన్ని శనివారం డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌) వి.మోహన్‌ రావు సాంకేతికంగా చార్జింగ్‌ చేసి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యుత్‌ ఉపకేంద్రం అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఉన్న పట్టణ విద్యుత్‌ ఉపకేంద్రాలపై లోడ్‌ భారం తగ్గుతుందని తెలిపారు. జనగామ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని విద్యుత్‌ వినియోగదారులకు మరింత నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఈ ఉపకేంద్రం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఎన్‌పీడీసీఎల్‌ సీఈ (కన్‌స్ట్రక్షన్‌) జయ వంత్‌ రావు చౌహాన్‌, ఎస్‌ఈ చెరుకు సంపత్‌రెడ్డి, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, డీ ఈ విజయ్‌, హనుమకొండ ఈఈ అనూప్‌ కుమార్‌, ఏడీఈ స్వామిరెడ్డి, ఏడీఈ వేణుగోపాల్‌, ఏడీఈ హుస్సేన్‌, ఏఈలు మధు, రాజశేఖర్‌ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement