మహిళా హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి | - | Sakshi
Sakshi News home page

మహిళా హక్కుల పరిరక్షణకు సమష్టి కృషి

Nov 29 2026 1:28 PM | Updated on Nov 29 2026 1:28 PM

● శక్తి సంవాద్‌లో పాల్గొన్న తెలంగాణ

మహిళా కమిషన్‌ సభ్యురాలు చిట్యాల శ్వేత

పాలకుర్తి టౌన్‌: మహిళా హక్కుల పరిరక్షణ, సాధికారతే లక్ష్యంగా జాతీయ మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో బిహార్‌లోని రాజ్‌గిర్‌లో నిర్వహించిన శక్తిసంవాద్‌ కార్యక్రమంలో మండల కేంద్రానికి చెందిన తెలంగాణ మహిళా కమిషన్‌ సభ్యురాలు చిట్యాల శ్వేత పాల్గొన్నారు. ఈ నెల 27, 28న జరిగిన ఈ కార్యక్రమంలో శనివారం మహిళలపై హింస, వివక్ష నివారణ, భధ్రత, సంక్షేమం తదితర అంశాలపై చర్చించారు. జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయా రహత్కర్‌తో పాల్గొని అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ తరఫున చిట్యాల శ్వేత, కాసోజు శంకరమ్మ, శశికళ యాదవరెడ్డి, ఎన్‌ రాధాబాయి, సదాలక్ష్మీ, ఉజ్మా, కార్యదర్శి పద్మజ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రల కమిషన్ల మధ్య సమన్వయం, భవిష్యత్‌ కార్యాచరణపై చరిచంచినట్లు శ్వేత తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement