మహనీయుల ఆశయాల సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల ఆశయాల సాధనకు కృషి చేయాలి

Nov 29 2026 1:28 PM | Updated on Nov 29 2026 1:28 PM

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నరేష్‌

స్టేషన్‌ఘన్‌పూర్‌: నేటి ఆధునిక మాదిగ విద్యార్థి లోకం శాసీ్త్రయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, మహానీయుల ఆశయాల సాధనకు ఎంఎస్‌ఎఫ్‌లో భాగస్వాములై కృషి చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గోవిందు నరేష్‌మాదిగ అన్నారు. స్థానిక కేఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు గుర్రం నవీన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగ విద్యార్థుల మండలస్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. కాలానికి అనుగుణంగా కులవివక్ష రూపాలు మారాయి తప్ప అంతం కాలేదన్నారు. ఎంఎస్‌ఎఫ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ తిరుపతి, ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జ్‌ వేల్పుల సూరన్న, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ జిల్లెల మురళి, నాయకులు పైస రాజశేఖర్‌, సందెన రవీందర్‌, బొట్ల మహేష్‌, నాగరాజు, శ్రీధర్‌, శ్రీనివాస్‌, రాంచందర్‌, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement