లింగాలఘణపురం: ప్రజలు విద్యుత్‌పై అవగాహన ఉంటే ప్రమాదాలను నివారించవచ్చని వరంగల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, జనగామ సర్కిల్ నోడల్ ఆఫీసర్ శ్రీకాంత్ అన్నారు. గురువారం మండలంలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు జరుగుతున్న ఇంటర్నల్ ఓరియెంటేషన్ శిక్షణలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్‌ఈ సంపత్‌రెడ్డి, డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీ వేణుగోపాల్, హెచ్‌ఎం రవీందర్‌తో పాటు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.


