అన్నిరంగాల్లో అగ్రపథం!
– మరిన్ని ఫొటోలు
9లోu
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
అభివృద్ధి, సంక్షేమంలో మోడల్‌గా జిల్లా
ఉత్తములకు ప్రశంసలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మకంచ మినీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి సెల్యూట్ చేస్తున్న కలెక్టర్
మాట్లాడుతున్న
కలెక్టర్ రిజ్వాన్ బాషా
● పల్లె నుంచి పట్నం వరకు ప్రగతి పరుగులు
● జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు
● ఉపాధి, విద్య, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
● 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర రిజ్వాన్ బాషా షేక్
జనగామ: జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు వేగవంతంగా సాగుతున్నాయని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కలెక్టర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత మాట్లాడారు.. పాలకుర్తిలో అసంపూర్తిగా ఉన్న శ్రీసోమేశ్వర లక్ష్మీనర్సింహ కల్యాణ మండపాన్ని రూ.47 లక్షలతో పూర్తిచేసి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వడ్డీలేని రుణాలు, సీ్త్రనిధి సహాయం కలిసి రూ.475 కోట్లకు పైగా మంజూరై 100శాతం ప్రగతి సాధించారని కొనియాడారు. ఉపాధి హామీ పథకంలో 59శాతం పనిదినాలు, తాగునీటి సరఫరాలో 608 గ్రామాలకు 24 గంటల సేవలు అందిస్తున్నామన్నారు. దేవాదులతో 490 చెరువులు నింపగా, ఆసరా పింఛన్లు 75వేల మందికి చేరాయి. నీటి సంరక్షణ, ఆర్‌టీఐ, ఎన్నికల నిర్వహణలో జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు జిల్లాకు లభించడం మనందరి కృషి ఫలితమే అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో..
మహాలక్ష్మి పథకంలో జిల్లాలో 2,89,66,830 మంది మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని కలెక్టర్ తెలిపారు. దీంతో ఆర్టీసీకి రూ.140.63 కోట్లు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. గృహజ్యోతి స్కీం ద్వారా 200 యూనిట్లలోపు వినియోగదారులకు ఉచిత విద్యుత్ 4,92,000 జీరో బిల్లులు జారీ కాగా, 94,298 కుటుంబాలకు రూ.25.83 కోట్లు సబ్సిడీగా అందించామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు 76.20శాతం ప్రగతితో రాష్ట్రంలో జనగామకు మొదటి స్థానం లభించిందన్నారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలుచేస్తున్న యూరియా బుకింగ్ యాప్ రైతులకు సులభతరంగా మారిందన్నారు.
ధన్‌ధాన్యలో పైలట్ జిల్లాగా..
ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన ప్రయోగాత్మక అమలుకు రాష్ట్రం నుంచి ఎంపికై న నాలుగు జిల్లాల్లో జనగామ ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర పథకాలను అనుసంధానం చేస్తూ పలు రంగాల్లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలువగా, రైతులకు రూ.385 కోట్లు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో కొత్తగా 25వేల రేషన్‌కార్డులను జారీ చేశామని, దీంతో 1,85,358 లబ్ధిదారులకు సన్నబియ్యం అందుతున్నాయన్నారు. పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో ఆధునిక రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.200కోట్లు కేటాయించిందన్నారు. పర్యావరణ అవగాహనపై నిర్వహించి ఎన్‌ఎస్‌పీసీ–2025 పోటీల్లో 75,156 మంది జిల్లా విద్యార్థులు పాల్గొని జాతీయ స్థాయిలో మొదటి స్థానం సాధించారన్నారు. మహిళా శక్తి స్కీంలో మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వనితటీ సెంటర్లు, యూనిఫాం తయారీ, ఆర్టీసీ అద్దె బస్సుల వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.
పట్టణంలో సుందరీకరణ..
జనగామ పురపాలకపరిధిలో బతుకమ్మకుంట, జంక్షన్లు తదితర ప్రాంతాల్లో సుందరీకరణ, గార్లకుంట వరకు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ శ్రీరాంనగర్‌లో మోడల్ వైకుంఠధామం, టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో రూ.18.74 కోట్ల విలువైన రహదారి, సౌకర్యాల పనులు, నైట్ షెల్టర్స్, లేబర్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. స్టేషన్‌ఘనపూర్ కొత్త మున్సిపాలిటీలో రూ.50 కోట్లు మంజూరు కాగా, టౌన్ హాల్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మోడల్ మార్కెట్, పార్క్, లైబ్రరీ, ఓపెన్ జిమ్ నిర్మాణాలు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. దేవాదులకు సంబంధించి రూ.3,838 కోట్ల ఖర్చు చేస్తుండగా, 91శాతం భూసేకరణ పూర్తయిందన్నారు. ఆర్‌ఎస్ ఘన్‌పూర్, నవాబ్‌పేట మెయిన్ కెనాల్, పంప్‌హౌస్ పనుల కోసం రూ.148.76 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో ఉత్తమ జిల్లాగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా సత్కారం లభించిందన్నారు.
అన్నిరంగాల్లో అగ్రపథం!
అన్నిరంగాల్లో అగ్రపథం!
అన్నిరంగాల్లో అగ్రపథం!


