మొదటి రోజు 9
ఒకటే నామినేషన్..
జనగామ: జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ పురపాలిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. జనగామలో 8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఒక నామినేషన్.. మొత్తంగా 9మంది నామినేషన్లు దాఖలు చేశారు. జనగామ మున్సిపల్‌లో 4, 11, 14, 15, 20, 21, 27, 30 వార్డుల పరిధిలో బీఆర్‌ఎస్ 3, కాంగ్రెస్ 2, సీపీఐ 1, స్వతంత్రలు రెండు నామినేషన్లు దఖాలు చేసినట్లు కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. నామినేషన్ సెంటర్‌ను కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి పరిశీలించారు.
ఎన్నికలకు సహకరించాలి
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ కోరారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సమీక్షించారు. నామినేషన్ వేసేందుకు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల పర్యవేక్షకులు శ్రీధర్, వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
ఎన్నికలకు సంబంధించిన సమస్యలు, సందేహాలను నివృత్తి చేయడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్ 93908 30087 ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు పూర్తి వివరాలకోసం హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.
స్టేషన్‌ఘన్‌పూర్: స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటుచేసిన కేంద్రంలో తొలిరోజు ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. 8వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పోగుల సారంగపాణి నామినేషన్ వేసినట్లు జిల్లా అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ బి.రాధాక్రిష్ణ తెలిపారు.
మున్సిపల్ నామినేషన్లు షురూ
జనగామలో 8, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 1
మొదటి రోజు 9
మొదటి రోజు 9


