జనగామ: రెవెన్యూ వ్యవస్థలో అవనీతి పేరుకుపోయిందనే కారణం చేత గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీర్వోల వ్యవస్థను రద్దు చేసి.. ఉద్యోగుల అర్హత ఆధారంగా ఇరత శాఖల్లో విలీనం చేసింది. దీంతో రెవెన్యూ పరంగా గ్రామాల్లో కొంతమేర ఇబ్బందులు తలెత్తినప్పటికీ.. ఆ బాధ్యతలను వీఆర్‌ఏలకు అప్పగించారు. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా అప్పటి సర్కా రు వెనక్కి తగ్గలేదు. అధికారంలోకి రాగానే వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ జీఓ జారీ చేశారు. రెవెన్యూ శాఖలో గ్రామ పరి పాలనా వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే క్రమంలో వీఆర్వో, వీఆర్‌ఏలను రిటన్ బ్యాక్ తీసుకునేందుకు ‘గ్రామ పాలనా అధికారి’(జీపీఓ)గా పేరు మార్చారు. ఇందుకు సంబంధించి స్పష్టమైన విధివిధానాలు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ధ్రువీకరణ పత్రాల జారీ, భూ వివాదాల విషయంలో సత్వర పరిష్కారం, విలువైన భూములను కాపాడడంతో పాటు రెవెన్యూ పరంగా వీఆర్వోల నియామకంతో తహసీల్దార్లపై కొంతమేర ఒత్తిడి తగ్గనుంది. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత ఐదేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత పేరు మార్చుకుని జీపీఓ గా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరనున్నారు. జిల్లాలో 116 మంది వీఆర్వోల అంగీకారం మేరకు అదే హోదాలో ఉద్యోగంలో చేరునుండగా.. ఇంటర్, డిగ్రీ ఆధారంగా వీఆర్‌ఏలను తీసుకోనున్నారు.
గత అనుభవాన్ని
పరిగణలోకి తీసుకోవాలి
రద్ధయిన గ్రామ రెవెన్యూ అధికారిని ఎలాంటి షరతులు లేకుండా.. గత అనుభ వం, సీనియారిటీని పరిగణలోకి తీసుకుని ప్రమోష న్లు కల్పించేలా చూడాలి. గడిచిన ఐదేళ్ల నుంచి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లేక ఇబ్బందులకు గురైన వీర్వోలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఎప్పుడూ.. ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది.
– పెండెల శ్రీనివాస్,
గ్రామ రెవెన్యూ అధికారుల జిల్లా జేఏసీ చైర్మన్
గ్రామ పాలనాధికారిగా పేరు మార్పు
త్వరలో వెలువడనున్న విధి విధానాలు