వామ్మో ఫీజులుం | - | Sakshi
Sakshi News home page

వామ్మో ఫీజులుం

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

తోక పేర్లతో ప్రైవేటు దోపిడీ అందినంతా గుంజుతున్న యాజమాన్యాలు ఇక నుంచి వివరాలన్నీ బోర్డులపై ఉంచాల్సిందే.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 294

చిన్నచిన్న గదుల్లో ప్రైవేటు పాఠశాలలను నెలకొల్పి.. కార్పొరేట్‌ తరహాలో హంగులు అద్ది.. ఇతర ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులను తెప్పించి కొనసాగిస్తున్నారు. వాటి నిర్వహణ భారమంతా విద్యార్థులపైనే వేస్తున్నారు. స్కూల్‌ ఫీజుతోపాటు, వివిధ రకాల ఎగ్జామ్‌లు, స్పోర్ట్స్‌, కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌ అంటూ మధ్యమధ్య వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై ఒత్తిడి తేవడంతో తల్లిదండ్రుల వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ మారాం చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు అప్పోసప్పో తెచ్చి పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండేది కాదు. ఈ క్రమంలో వీటన్నింటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో నోటీసు బోర్డులపై అన్ని వివరాలు ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఫిర్యాదు చేసేందు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేలా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు. www. schoole-edu.gov.in ద్వారా ఫిర్యాదు సైతం చేయవచ్చు. ఆన్‌లైన్‌లో నమోదైన ఫిర్యాదులను విద్యాశాఖ పరిశీలించి నిబంధనల ప్రకారం లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు.

పేద, మధ్యతరగతి వారికే

ప్రభుత్వ స్కూళ్లపై ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతున్నా.. ఇంకా 50శాతం వరకు ప్రైవేటు స్కూళ్లలోనే చదివిస్తున్నారు. పిల్లలను ప్రయోజకులను చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటు స్కూళ్లలో జాయిన్‌ చేయిస్తున్నారు. ఫీజుకన్నా నోట్‌బుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌, ఇతరత్నాకే అత్యధికంగా ఖర్చవుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో ప్లేగ్రౌండ్స్‌ లేకున్నా.. వసతులు, పార్కింగ్‌ సౌకర్యం లేకున్నా.. ఫీజులు మాత్రం అందినంతా దోచుకుంటున్నారు.

జగిత్యాల: జిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. ఎల్‌కేజీకే రూ.30 నుంచి రూ.40 వేలు వసూలు

చేస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ఈటెక్నో, సీబీఎస్‌ఈ, నీట్‌ ఫౌండేషన్‌, ఐబీఎస్‌ఈ పేరిట అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఫలితంగా పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటులో చదివించాలంటేనే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్‌ ఫీజుకు అదనంగా యూనిఫా మ్స్‌, టై, బెల్ట్స్‌, షూస్‌, ఐడీకార్డ్స్‌, యాప్స్‌ తదితర వాటి కోసం మరింత వసూలు చేస్తూనే ఉంటారు. అడ్మిషన్‌ పొందేవరకూ ఒకలా.. పిల్లలను చేర్చాక మరోలా వసూలు చేస్తారనే ఆరోపణలున్నాయి. అయితే వీటన్నింటిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ డైరెక్టర్‌ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల వివరాలను తప్పకుండా నోటీసుబోర్డులపై ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులతో సమావేశం

నిర్వహించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనుంది.

జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు

ప్రాథమిక : 12 యూపీఎస్‌ : 153

హైస్కూళ్లు : 129

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement