జగిత్యాల: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బట్టి వెంకటయ్య మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. చైర్మన్‌తోపాటు సభ్యులు నీలాదేవి, రాంబాబునాయక్, కుంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ పాల్గొననున్నారు.
ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
జగిత్యాలక్రైం: ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ లేని వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సంధాని అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బస్ డిపో సమీపంలో జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన పత్రాలు లేని 16 వాహనాలను సీజ్ చేశారు. పరిమితిలోపే వాహనాల్లో తీసుకెళ్లాలని సూచించారు. ఓవర్‌లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి అన్నారు. ఏఎంవీఐలు రామారావు, సాయిచరణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


