● అధికారులకు అదనపు కలెక్టర్‌ ఆదేశం ● బాధితుల నుంచి అర్జీల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

● అధికారులకు అదనపు కలెక్టర్‌ ఆదేశం ● బాధితుల నుంచి అర్జీల స్వీకరణ

Sep 1 2026 12:31 AM | Updated on Sep 1 2026 12:31 AM

● అధికారులకు అదనపు కలెక్టర్‌ ఆదేశం ● బాధితుల నుంచి అర్జీల స్వీకరణ

జగిత్యాలటౌన్‌: ప్రజావాణికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌.లత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఆమె వెంటనే పరిష్కరించాలని సూచించారు. జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో మదన్‌మోహన్‌ పాల్గొన్నారు.

తప్పుడు కార్డుదారులను

గుర్తించండి

చేయూత పథకంలో భాగంగా గీత కార్మికులకు పెన్షన్‌ మంజూరుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొందరు అనర్హులు తప్పుడు గుర్తింపు కార్డులు సృష్టించుకుని పెన్షన్‌ కోసం దరఖాస్తు చేస్తున్నారు. అలాంటి వారిని తొలగించండి.

– గీత పారిశ్రామిక సంఘం ప్రతినిధులు

పారితోషికం పెంచండి

వ్యవసాయ భూముల డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహిస్తున్న మాకు ఫొటోకు ప్రభుత్వం రూ.ఏడు మాత్రమే చెల్లిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫొటోకు రూ.15 పెంచి ఆదుకోవాలి.

– డిజిటల్‌ క్రాప్‌ సర్వే వాలంటీర్స్‌

ఆడిటోరియం నిర్మించండి

జిల్లాకేంద్రంలోని తహసీల్‌ చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో అంబేడ్కర్‌ మెమోరియల్‌, ఆడిటోరియం నిర్మించండి. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించడం సరికాదు. పాత రెవెన్యూ కార్యాలయం స్థలంలో అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆడిటోరియం నిర్మించండి.

– బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు

రాష్ట్రంలోని 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.14 వేల కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసి న్యాయం చేయాలి.

– బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు

ఫీజు రీయింబర్స్‌మెంట్‌

విడుదల చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement