ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాయికల్: జిల్లాకేంద్రానికి 4,500 డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసిన మాజీ సీఎం కేసీఆర్‌కు.. సదుపాయాలకు రూ.36 కోట్లు మంజూరు చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన ధ న్యవాదాలు తెలుపుతున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. మండలంలోని చింతలూరు, ఇటిక్యాల, రామాజీపేటలో ఇందిరమ్మ లబ్ధిదారుల గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. తాను రేవు దాటాక తెప్పతగిలేసే రకం కాదని, అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నానని గుర్తుచేశారు. అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని, నియోజకవర్గానికి 10 వేల ఇళ్లు వచ్చేలా చూస్తామని తెలిపారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి సర్పంచులు బెజ్జంకి మోహన్, నీరటి శ్రీనివాస్, వనిత, రమేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బేతి మోహన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు తంగెళ్ల రమేశ్ పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
జగిత్యాలరూరల్: నిరుపేదలందరికీ దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సారంగాపూర్ మండలం రంగపేటలో రాచమల్ల లక్ష్మీ, గంగన్న గృహప్రవేశంలో పాల్గొన్నారు. సర్పంచ్ ఏదు ల శేఖర్, ఉపసర్పంచ్ కాసు నరేశ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ బాపిరాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


