జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలకు అందించే ఎరువుల రవాణాభారాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం భరించగా.. తాజాగా చేతులేత్తేసింది. ఇందుకు సంబంధించిన జీవోను అన్ని సహకార సంఘాలకు పంపించి, వెంటనే అమలు చేయాలని ప్రకటించింది. ఆ భారమంతా ఇకనుంచి రైతులపైనే పడనుంది. ఇక నుంచి ఓపెన్‌మార్కెట్ మాదిరిగానే సహకార సంఘాలు కూడా రసాయన ఎరువులను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంది. ఈ లెక్కన ఒక్కో బస్తాపై అదనంగా రూ.15 వరకు రవాణా చార్జీల పేరిట రైతులపై భారం పడే అవకాశం ఉంది. దీనిపై ఇటీవల జిల్లాలోని సహకార సంఘాల అధ్యక్షులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ప్రభుత్వ జీవోను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
మార్క్‌ఫెడ్ ద్వారా ఉచిత రవాణా
మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలోని అన్ని సహకార సంఘాలకు రసాయన ఎరువులు అందుతాయి. రైల్వే వ్యాగన్లలో లేదంటే గోదాముల్లో నిల్వ చేసిన ఎరువులను ఆయా సంఘాలకు అవసరాన్ని బట్టి మార్క్‌ఫెడ్ సంస్థ పంపిస్తుంటుంది. మార్క్‌ఫెడ్ సంస్థ లారీల్లో హమాలీలతో ఎరువుల బస్తాలను లోడ్ చేయించి సంఘాలకు పంపించేంది. లారీ, హమాలీల ఖర్చు మార్క్‌ఫెడ్ భరించేది. దీంతో సహకార సంఘాలు హమాలీ ఖర్చు, సంఘానికి లాభం చూసుకుని, బయటి వ్యాపారుల కంటే తక్కువ రేటుకు రైతులకు ఎరువులు అందించేవారు. ఒక్క సహకార సంఘానికి ఒక లారీ యూరియా ఎరువుల లోడ్ వస్తే.. బస్తా అసలు ధర రూ.252.40, హమాలీ ఖర్చు రూ.6.50, మాములు కింద బస్తాకు రూ.2.25, సంఘం లాభం కింద బస్తాకు రూ.5.35 ఇలా మొత్తం బస్తాకు రూ266.50 ధర చొప్పున రైతులకు అమ్ముతుంటారు. మల్లాపూర్, కథలాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లోని చివరి గ్రామాల సొసైటీలకు చేర్చితే ఖర్చు మరింతగా వచ్చేది.
రవాణా భారం ఎత్తివేత
ప్రభుత్వం తాజాగా మార్క్‌ఫెడ్ నుంచి సంఘాలకు ఉచితంగా సరఫరా చేసే లారీల రవాణా ఖర్చును ఉపసంహరించుకుంది. ఇకనుంచి లారీల ఖర్చును సంఘాలే భరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు యూరియా బస్తా సంఘంలో రూ.266కు లభిస్తే, ప్రైవేట్ డీలర్ల వద్ద రూ.300కు దొరికేది. తాజాగా మార్క్‌ఫెడ్ ఏర్పాటు చేసిన ర్యాక్‌ల వద్దకు లారీలను మాట్లాడుకుని, ఎరువులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లారీ కిరాయిలు పెంచే అవకాశం ఉండటంతో సహకార సంఘాలు ఎరువుల విక్రయం నుంచి తప్పుకొనే ఆలోచన చేస్తున్నాయి.
రైతులపై పెనుభారం
ఇక, ప్రైవేట్ డీలర్ల చేతిలో రసాయన ఎరువులు


