కోరుట్ల రూరల్: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వాలని మండల వ్యవసాయ అధికారి నాగమణి అన్నారు. వెంకటాపూర్ గ్రామంలో బుధవారం పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో కలిసి ఎల్‌నినోపై రైతులకు అవగాహన కల్పించారు. పలు గ్రామాల్లో మొక్కజొన్న పంటలను పరిశీలించారు. సర్పంచ్ ద్యాగ గంగాదర్, శాస్త్రవేత్తలు సుమలత, రామకృష్ణ, మధుకర్, ఏఈవో ఫమీనా పాల్గొన్నారు.
మేడిపల్లి: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త డా.ఎ.విజయ్‌భాస్కర్ కొండాపూర్, మేడిపల్లి గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి ఎండీ షాహిద్ అలీతో కలిసి వరి, పత్తి, మొక్కజొన్న పంట పొలాల్లో క్షేత్ర సందర్శన నిర్వహించారు. రైతులకు సాగు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.


