రాయికల్: జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా ఇందిరానగర్‌కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థులకు జెండా ఆవశ్యకతతోపాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అధ్యక్షుడు వాసం ప్రసాద్, సెక్రటరీ కనపర్తి శ్రీనివాస్, కోశాధికారి సుదవేని మురళీగౌడ్, సభ్యులు బత్తిని భూమయ్య, మ్యాకల రమేశ్, రాంరెడ్డి, ఆదిరెడ్డి, గంప ఆనందం, అశోక్, రవి, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
గొల్లపల్లిలో..
గొల్లపల్లి: జాతీయ పతాక స్వీకరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ ఆవరణలో బుధవారం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. ఎంఈవో చెరుకు రాజన్న, క్లబ్ అధ్యక్షుడు పాల్గొని పోటీలను పర్యవేక్షించారు. ఎంఈఓ మాట్లాడుతూ జాతీయ పతాకం స్వేచ్ఛ, ఐక్యతకు సజీవ ప్రతిరూపమన్నారు. తెలుగు ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య ఎంతో అధ్యయనం చేసి జెండాను రూపకల్పన చేయడం గర్వకారణంమన్నారు. అనంతరం విద్యార్థులకు జాతీయ పతాక విశిష్టత – పింగళి వెంకయ్య పాత్ర అంశంపై వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించారు. ప్రిన్సిపల్ సుంకరి రవి, లయన్స్ క్లబ్ కోశాధికారి సురేష్, ప్రోగ్రామింగ్ చైర్మన్, మాజీ ఎంపీటీసీ భీమసత్యం, లీడ్ ఇండియా ఫౌండేషన్ మేనేజర్ తాడూరి శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


