ప్రజా విజయంతో బాధ్యత పెరిగింది
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మున్సిపల్ ఫలితాలు భిన్నంగా రావడంతో క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వర్గీయులు హైదరాబాద్‌కు వెళ్లగా.. తాజాగా జీవన్‌రెడ్డి వర్గం కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోగానీ.. రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. జగిత్యాలలో మొత్తం 50 వార్డులకు గాను కాంగ్రెస్ 23, స్వతంత్రులు 15, బీజేపీ 6, బీఆర్‌ఎస్ 4, ఎంఐఎం 2స్థానాలు విజయం సాధించాయి. చైర్మన్ పీఠం దక్కాలంటే 26 మంది కావాలి. కాంగ్రెస్‌కు 23 ఉన్నప్పటికీ ఆ పార్టీలో కోల్డ్‌వార్ జరగడంతో ఫలితం ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. బీఫామ్‌ల విషయంలో సంజయ్‌కుమార్‌కు పెద్దపీట వేసిన కాంగ్రెస్ 35 స్థానాలు కట్టబెట్టింది. వీరిలో 16మంది గెలిచారు. జీవన్‌రెడ్డికి 15 స్థానాలు కేటాయించగా.. ఏడుగురు గెలిచారు. అలాగే టికెట్ రాని వారు జీవన్‌రెడ్డి మద్దతుతో మరో 10 మంది గెలిచారు. సంజయ్ తరఫున టికెట్ రానివారు స్వతంత్రంగా పోటీచేసిన వారిలో ఇద్దరు గెలిచారు. ఈ లెక్కన ఎమ్మెల్యే వర్గంలో 18, జీవన్‌రెడ్డి వర్గంలో 17 మంది సభ్యులు ఉన్నారు. మరోవైపు బీజేపీ రెబల్స్ ముగ్గురు, ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యే సంజయ్ శిబిరంలో వెళ్లినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి వర్గంలోని ఓ వ్యక్తి ఎమ్మెల్యే వెంట వెళ్లినట్లు సమాచారం.
కిస్సా కుర్చీకా..
పురపీఠాన్ని దక్కించుకునేందుకు అటు సంజయ్‌కుమార్, ఇటు జవన్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌కే పీఠం దక్కే అవకాశం ఉన్నప్పటికీ ఇందులో తమ వర్గీయులకే దక్కాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే తరఫున మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, సమిండ్ల వాణి పోటీపడుతుండగా.. జీవన్‌రెడ్డి మాత్రం మొదటి నుంచి జెండా మోసిన వారికే.. పార్టీలో కష్టపడిన వారికే పదవి ఇవ్వాలని అధిష్టానంతో చర్చించినట్లు తెలిసింది. మధ్యలో వచ్చిన వారికి ఇవ్వొద్దని కోరినట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి తరఫున ఇప్పటికే తోపారపు లావణ్య, ములస్తం లావణ్యను సూచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎమ్మెల్యే మాత్రం తన వర్గీయులకే చైర్మన్ పీఠం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపులో కాంగ్రెస్ నుంచి 18, స్వతంత్రులు ఇద్దరు, బీజేపీ రెబల్స్ ఇద్దరు, ఎంఐఎం ఇద్దరు మొత్తంగా 24 మంది కౌన్సిలర్లు ఉన్నట్లు సమాచారం. జీవన్‌రెడ్డి వర్గం నుంచి మరొకరు వెళ్లడంతో ఆయన బలం 25కు చేరింది. ఎమ్మెల్యే ఎక్స్‌అఫిషియో ఓటు జగిత్యాలలోనే ఉండటంతో ఆయన ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు జీవన్‌రెడ్డి వర్గంతో బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు కలిస్తే వీరు కూడా పురపీఠం కై వసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఎక్కడ చూసినా ఇదే చర్చ..
జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా మున్సిపాలిటీ చైర్మన్ పదవిపైనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానంటూ కాంగ్రెస్ వైపు ఉన్న ఎమ్మెల్యే... సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి మధ్య మున్సిపల్ పోరు కొనసాగింది. ఈ క్రమంలో ఇద్దరూ సమానంగానే సీట్లు సాధించారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే శకునిలా తయారయ్యాడని, సునాయాసంగా 40 సీట్లు వచ్చే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే జోక్యంతో 20కి దిగజారాల్సి వచ్చిందని జీవన్‌రెడ్డి బహిరంగంగానే విమర్శిస్తున్నారు. రాయికల్‌లోనూ పది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండగా.. 8టికెట్లు తన వర్గానికి ఇప్పించుకున్న ఎమ్మెల్యే ఒక సీటుకే పరిమితమై రాయికల్‌లో కాంగ్రెస్‌ను చిన్నాభిన్నం చేశాడని అంటున్నారు.
15 వార్డుల్లో విజయంపై..
ప్రతి వార్డులోనూ ప్రజలు మాపై నమ్మకం ఉంచారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ అవినీతి, అభివృద్ధిలేమిపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. నియోజకవర్గంలో 2009 నుంచి ప్రజల మధ్యే ఉంటున్నాను. ఓడినా, గెలిచినా వారి కోసమే పనిచేశాను. ప్రజల్లో అన్నగా.. కుటుంబసభ్యుడిగా ఉన్నాను. రెండేళ్ల నుంచి ఎమ్మెల్యేగా.. విప్‌గా.. మంత్రిగా నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం.
సామాన్యులు కూడా నాతో మాట్లాడవచ్చు
2009 నుంచి 2023 వరకు నా రాజకీయ జర్నీ ఇక్కడే సాగింది. ప్రజలు ఏ పనిమీద వచ్చినా అందుబాటులో ఉంటున్నా. సామాన్యుడు కూడా నేరుగా నాతో మాట్లాడే అవకాశం కల్పించి వారి సమస్యలను పరిష్కరించాను. ధర్మపురిలో మూతపడిన కళాశాలను తెరిపించడం, డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాల తీసుకురావడం, గోదావరిలో మురికినీరు కలవకుండా రూ.14 కోట్ల నిధులు తీసుకురావడం, 15 వార్డుల్లో డ్రైనేజీ, తాగునీటి సమస్య, సంఘ భవనాలు, ఇలా అనేక సదుపాయాలపై దృష్టి పెట్టాం. దీంతో ప్రజలు మాపై నమ్మకం పెట్టుకుని మా అభ్యర్థులను గెలిపించారు.
ఐదేళ్లలో ధర్మపురిని తీర్చిదిద్దుతాం
మున్సిపాలిటీలో మురికినీటి సమస్య లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మెరుగుపరుస్తాం. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిస్తాయిలో నెరవేరుస్తాం. ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేసి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తాం
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలెక్టర్, సంబంధిత అధికారులతో మంచినీటి సమస్యపై రివ్యూ మీటింగ్‌లు ఏర్పాటు చేసి పరిష్కారానికి కృషి చేశాను. తలాపున గోదావరి ఉన్నా తాగునీరు మాత్రం మెట్‌పల్లి నియోజకవర్గం డబ్బా నుంచి వస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్నవారు ఇక్కడికి లిఫ్ట్ ఏర్పాటు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం చూపలేదు. కనీసం మంచినీరు కూడా తాగించలేదు. నేను ఆ సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాను.
ధర్మపురిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం
ధర్మపురి క్షేత్రాన్ని దక్షిణకాశీగా పిలుస్తారు. ఈ పట్టణాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటక కేంద్రంగా యాదగిరి గుట్ట తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మాస్టర్ ప్లాన్ పనులు వేగవంతం చేస్తాం. అలాగే 2027లో గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డితో చాలా సందర్భాల్లో మాట్లాడాం. ధర్మపురిలో పుష్కరాలు కుంభమేళాను తలపించేలా ప్రణాళిక రూపొందించాం. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించడానికి వేలాది కోట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను.
విజయంలో పార్టీ కార్యకర్తల పాత్ర అభినందనీయం
నాపై ఉన్న నమ్మకంతో రేయింబవళ్లు శ్రమించి పార్టీ విజయం కోసం శ్రమించిన ప్రతి కార్యకర్త, నాయకుడికి పేరుపేరున ధన్యవాదాలు. ఇకపై ధర్మపురిలో పైరవీలు ఉండవు. ప్రతి సంక్షేమ పథకం అర్హులకు నేరుగా అందుతుంది. కౌన్సిలర్లంతా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించేలా చేస్తాను. ప్రజలు ఇచ్చిన ఈ గెలుపు మరింత బాధ్యతను పెంచింది.
జగిత్యాల మున్సిపాలిటీలో రెబల్స్ హవా నడువగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన కొందరు ఇప్పటికే ప్రలోభాల ఎర చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే బీజేపీ రెబల్స్‌గా గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లతోపాటు, ఎంఐఎంకు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, స్వతంత్ర కౌన్సిలర్‌ను క్యాంప్‌నకు తరలించినట్లు వినిపిస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో ఎన్నడు లేనివిధంగా క్యాంప్ రాజకీయాలు నడుస్తున్నాయి. చైర్మన్ సీటు కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. చైర్మన్ పదవి ఆశిస్తున్న వారు ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఇప్పటికే వార్డు నుంచి దాదాపు రూ.20నుంచి రూ.25 లక్షల వరకు ఖర్చు చేసి కౌన్సిలర్ పదవి దక్కించుకున్నారు. స్వతంత్రులకు ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అనేక ఆరోపణలు వస్తున్నాయి.
గొల్లపల్లి:ధర్మపురి బల్దియాలో 15 వార్డుల్లో గెలిపించి.. క్లీన్‌స్వీప్ విజయం అందించారని, ఇది ప్రజల విజయమని ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఇందుకు ప్రతి కార్యకర్త కష్టపడ్డారని తెలిపారు. విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. శనివారం ‘సాక్షి’తో
మాట్లాడారు.
ప్రజా విజయంతో బాధ్యత పెరిగింది
ప్రజా విజయంతో బాధ్యత పెరిగింది


