మెట్‌పల్లిలో ఎడతెగని ఉత్కంఠ!
మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. హంగ్ ఫలితాలు రావడంతో ఏ పార్టీకి పదవి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. మొత్తం 26 వార్డులుంటే.. బీజేపీ 10, బీఆర్‌ఎస్ 6, కాంగ్రెస్ 6, ఇండిపెండెంట్లు 4స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చైర్మన్ పీఠం దక్కాలంటే 14 స్థానాల మె జార్టీ అవసరం. కానీ ఏ పార్టీకి కూడా ఆ మేరకు మె జార్టీ రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చైర్మ న్ పదవిపై కన్నేసిన అధికార కాంగ్రెస్.. త్యధిక స్థా నాలను గెలుచుకున్న బీజేపీ అవసరమైన ‘మెజా ర్టీ’ని సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ వైపు ముగ్గురు ఇండిపెండెంట్లు
గెలిచిన నలుగురు ఇండిపెండెంట్లలో ముగ్గురు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం హై దరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ క్యాంపులో ఆ పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నట్లు సమాచారం. వీరి మద్దతుతో కాంగ్రెస్ బలం 9కి పెరుగుతుంది.
బీజేపీకి మైనార్టీ కౌన్సిలర్ మద్దతు?
అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి మరో నలుగురు సభ్యుల మద్దతు అవసరం. మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఇండిపెండెంట్ మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు వైస్‌చైర్మన్ పదవితోపాటు అతను సూచించిన వ్యక్తికి కో–ఆప్షన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఆ కౌన్సిలర్ మద్దతుతో బీజేపీ సంఖ్య 11కు చేరుకుంటుంది.
బీఆర్‌ఎస్ వైపు రెండు పార్టీల చూపు
ఈ ఎన్నికల్లో తక్కువ సంఖ్యలో గెలుపొందిన బీఆర్‌ఎస్.. చైర్మన్ పీఠంపై ఆశలు వదులుకుంది. ఈ పా ర్టీ మద్దతుతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నా యి. బీఆర్‌ఎస్ కూడా పట్టణ అభివృద్ధి దృష్ట్యా రెండింటిలో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి చైర్మన్ ఎన్నికకు ఒక్క రోజే గడువు ఉండడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది.


