హంగ్‌ ఆర్భాటాలు | - | Sakshi
Sakshi News home page

హంగ్‌ ఆర్భాటాలు

Feb 15 2026 7:34 AM | Updated on Feb 15 2026 7:34 AM

హంగ్‌

హంగ్‌ ఆర్భాటాలు

న్యూస్‌రీల్‌

పొత్తుల దిశగా కత్తులు దూసుకున్న ప్రత్యర్థులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, మజ్లిస్‌ మిలాఖత్‌ అయినప్పటికీ పీఠంపై కూర్చుంటామంటున్న బీజేపీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన ఎంసీకే పంచాయితీ రాయికల్‌, మెట్‌పల్లిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దోస్తీ జమ్మికుంటలో బీఆర్‌ఎస్‌కు పీఠం దక్కకుండా కాంగ్రెస్‌ ఎత్తుగడ

జమ్మికుంటలో మొత్తం 30 సీట్లు ఉండగా.. బీఆర్‌ఎస్‌ 12 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్‌ 10, బీజేపీ 4, స్వతంత్రులు 3, ఏఐఎఫ్‌బీకి ఒకటి చొప్పున సీట్లు వచ్చాయి. స్వతంత్రులతో కలిసి బీఆర్‌ఎస్‌ జమ్మికుంటలో పాగా వేద్దామనుకుంటే.. పరిణామాలు మారాయి. బీఆర్‌ఎస్‌లో ఒక కౌన్సిలర్‌ వెళ్లి కాంగ్రెస్‌ శిబిరంలో చేరడంతో పరిస్థితి తలకిందులైంది. కాంగ్రెస్‌ 10, స్వతంత్రులు 3, ఏఐఎఫ్‌బీ 1, బీఆర్‌ఎస్‌ రెబల్‌ ఒకటి కలిపి మొత్తం 15 స్థానాలతో మున్సిపాలిటీ కై వసం చేసుకునే యత్నాల్లో ఉంది. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఎక్స్‌అఫీషియో ఓటు ఉన్నప్పటికీ మున్సిపాలిటీని వశపరచుకోవడం క్లిష్టంగా మారింది.

జగిత్యాల జిల్లా రాయికల్‌ మున్సిపాలిటీలో హంగ్‌ రాజకీయం సాగుతోంది. మొత్తం 12 సీట్లున్న మున్సిపాలిటీలో బీజేపీ 5, బీఆర్‌ఎస్‌ 3, కాంగ్రెస్‌ 3, స్వతంత్రులు ఒకటి చొప్పున సీట్లు గెలిచారు. ఇక్కడ అనూహ్యంగా బీఆర్‌తఎస్‌, కాంగ్రెస్‌ జట్టు కట్టడంతో ఇక్కడ బీజేపీకి మున్సిపాలిటీ వశపరచుకోవడం క్లిష్టంగా మారింది.

మెట్‌పల్లిలో రాజకీయం మరోలా మారింది. 26 సీట్లున్న మెట్‌పల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు బీజేపీ గెలుచుకోగా.. బీఆర్‌ఎస్‌ 6, కాంగ్రెస్‌ 6, స్వతంత్రులు 4 సీట్లు సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పొత్తు చిగురించడంతో మెట్‌పల్లి మున్సిపాలిటీలో బీజేపీకి అవకాశాలు మృగ్యమయ్యాయి.

జగిత్యాల చైర్మన్‌ పీఠం ఎవరికి దక్కేనో..? మొదలైన క్యాంప్‌ రాజకీయాలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్న నాయకులు జగిత్యాలలో కాంగ్రెస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

జగిత్యాల

7

ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారా యి. కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు రాయికల్‌, మెట్‌పల్లి, జమ్మికుంటలో పరిస్థితి భిన్నంగా మారింది. ఎన్నికల ఫలితాల వరకు మా టల కత్తులు దూసుకున్న పార్టీలు మేయర్‌, మున్సి పల్‌ చైర్మన్‌ కోసం పొత్తులు కుదుర్చుకుంటున్నా యి. ముఖ్యంగా 66 డివిజన్‌లు ఉన్న కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 30 సీట్లు బీజేపీ గెలుచుకుని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా మారింది. కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్‌బీ 2 చొప్పున గెలుచుకున్నారు. ఇండిపెండెంట్లలో నలు గురు చేరడంతో బీజేపీ బలం 34కు చేరింది. వీరికి స్థానిక ఎంపీ బండి సంజయ్‌ ఎక్స్‌అఫీషియో ఓటు తోడవడంతో బలం 35కు పెరిగింది. మేయర్‌ పీఠం కాంగ్రెస్‌కు రావాలని అధికార పార్టీ వ్యూహాలు రచించింది. బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌తో కలిసి అవగాహన కు వచ్చింది. కాంగ్రెస్‌ కూటమిలో కాంగ్రెస్‌ 14, బీఆర్‌ఎస్‌ 9, స్వతంత్రులు 5, ఎంఐఎం 3, ఏఐఎఫ్‌బీ 2, ఎక్స్‌అఫీషియో ఇద్దరితోపాటు ఇద్దరు ఎమ్మెల్యేలు (గంగుల కమలాకర్‌, కవ్వంపల్లి సత్యనారాయణ) ఓటుతో సంఖ్యాబలం 35 ఉందంటున్నారు. స్వతంత్ర అభ్యర్థి విషయంలో రెండు కూట ములు తమ వైపే ఉన్నారని వాదిస్తున్నారు. ఈ పంచాయితీ ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరడంతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

క్యాంపుల్లో కౌన్సిలర్లు

హంగ్‌ ఆర్భాటాలు1
1/3

హంగ్‌ ఆర్భాటాలు

హంగ్‌ ఆర్భాటాలు2
2/3

హంగ్‌ ఆర్భాటాలు

హంగ్‌ ఆర్భాటాలు3
3/3

హంగ్‌ ఆర్భాటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement