ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
జగిత్యాలక్రైం: ఫిట్‌నెస్ లేని వాహనాలను రో డ్డుపై తిప్పితే సీజ్ చేస్తామని ఏఎంవీఐ షేక్ రి యాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారుల్లో వాహనాలను తని ఖీ చేశారు. ట్యాక్స్ చెల్లించని 6 వాహనాలను సీజ్ చేశారు. వాహనదారులు ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, ట్యాక్స్, లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. రవాణా శాఖ ఆదేశాలు పాటించ ని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ
మల్యాల: కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు మోదీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించిన సైకిళ్లను మల్యాల, రామన్నపేట, పోతారం జెడ్పీ పాఠశాలల్లో పంపిణీ చేశారు. ఎంఈవో జయసింహారావు, బీజే పీ మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, నాయకులు గాజుల మల్లేశం, బొబ్బిలి వెంకటస్వామి యాదవ్, బొట్ల ప్రసాద్, గడ్డం నడిపిమల్లేశం, కెల్లేటి రమేశ్, బొమ్మెన పరమేశ్, నక్క అనందం, బండారి రాజు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ‘ఆదర్శ’ విద్యార్థి
ధర్మపురి: మండలంలోని మగ్గిడి ఆదర్శ పాఠశాల విద్యార్థిని ఐశ్వర్య రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై ంది. మంగళవారం నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–19 షాట్‌పుట్ పోటీల్లో బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించే రా ష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననుంది. విద్యార్థినిని ప్రిన్సిపాల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్, ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ అభినందించారు.
జువైనల్ జస్టిస్ బోర్డు చైర్‌పర్సన్‌గా శ్రీనిజ
జగిత్యాలజోన్: జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన జువైనల్ జస్టిస్ బోర్డు చైర్‌పర్సన్‌గా శ్రీనిజ కోహిర్కర్ వ్యవహరించనున్నారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం శ్రీనిజ జిల్లా మొదటి అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్‌గా కొనసాగుతున్నారు. బాలనేరాలకు సంబంధించిన కోర్టు కార్యకలాపాలను ప్రతి గురువారం జువైనల్ జస్టిస్ బోర్డులో నిర్వహించనున్నారు.
చెరువులు, కుంటలకు హద్దులు నిర్ణయించండి
జగిత్యాల: జిల్లాలోని చెరువులు, కుంటలకు హద్దులు, బఫర్‌జోన్లు నిర్ణయించి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు ఆక్రమణకు గురికాకుండా ఏర్పాటు చేసిన హైడ్రా ఫలితాలు ఇస్తోందని, జిల్లాల్లోని చెరువుల పరిరక్షణకు కృషి చేయాల ని కోరారు. అంతకుముందు వీఆర్‌ఏ వ్యవస్థ ను పునరుద్ధరించేలా కృషి చేయాలని జీవన్‌రెడ్డికి వీఆర్‌ఏలు వినతిపత్రం సమర్పించారు.
రైల్వేలైన్ పనుల్లో వేగం పెంచాలి
జగిత్యాలక్రైం: రైల్వేలైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ గోపాలకృష్ణ అన్నారు. లింగంపేట రైల్వేస్టేషన్‌లో నిర్మిస్తున్న రైల్వే గూడ్స్ లోడింగ్ పాయింట్ పనులు, మరమ్మతు పనులను పరిశీలించారు. గూడ్స్ లోడింగ్ షెడ్డు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బంది కలగనీయొద్దన్నారు. సీనియర్ డీసీఎం సిపాలి కుమారి, సీనియర్ డీవోఎం సురేశ్‌రెడ్డి, డీఎం శశాంక్, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్, రైల్వే మేనేజర్ వామనేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం
ఫిట్‌నెస్ లేని వాహనాలను సీజ్ చేస్తాం


