మంచాల పెట్రోల్‌బంక్‌ను తొలగించండి
జగిత్యాల: అధికారుల పట్టింపులేనితనంతో రూ.100 కోట్ల విలువ చేసే మున్సిపల్ భూమి అన్యాక్రాంతమైందని, మంచాల పెట్రోల్‌బంక్‌ను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం తహసీల్ చౌరస్తా నుంచి బల్దియా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. 1964లో వివాదం ఏర్పడినప్పటి నుంచి బల్దియా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. యావర్‌రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు ఏసీఎస్ రాజు, సీపెల్లి రవీందర్, లింగంపల్లి శ్రీనివాస్, అర్వ లక్ష్మీ, సుధాకర్, కిశోర్‌సింగ్, ప్రభాకర్, మల్లేశం, సురేశ్, ప్రమోద్, నాగరాజు పాల్గొన్నారు.


