ప్రమాదాలు పొంచి..
కొన్నిసార్లు అదుపు తప్పుతున్న ఆర్టీసీ బస్సులు మరమ్మతులు లేక రోడ్లపై పెద్దపెద్ద గుంతలు గాలిలో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు
సామర్థ్యం మించి..
నిబంధనలు పాటించని వాహనదారులు
జగిత్యాల: రహదారుల వద్ద నిబంధనలు పాటించకపోవడంతో జిల్లాలో ప్రమాదాలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు, టిప్ప ర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రధానంగా మొరం, కంకర, ఇసుక రవాణా చేసే టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు వేగంగా వెళ్లడంతో ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా ఢీ కొడుతున్నాయి. ఫలి తంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా యి. అతివేగం, అతిజాగ్రత్తగా నడపడంతో కుటుంబాలలో కన్పించని క్షోభ మిగులుతోంది. జిల్లాకేంద్రంలో నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతోంది. జగిత్యాల డిపో పరిధిలోని ఆర్టీసీ బస్సులు ఆరునెలల్లో 11సార్లు ప్రమాదాల బారిన పడ్డాయి. అంటే ప్రమాదాల తీవ్రత ఎంత ఉందో అద్దం పడుతోంది.
ఆర్టీసీ ప్రయాణమే ఎక్కువ
ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. నిత్యం బస్సుల కండీషన్ సరిచేసి డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేసిన తర్వాతే నడిపేందుకు అనుమతిస్తుంటారు. అయినప్పటికీ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయో తెలియని పరిస్థితి. ఎక్కువగా డ్రైవర్ల తప్పిదాలతోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల డిపోలున్నాయి. జగిత్యాలలో 110, కోరుట్లలో 70, మెట్‌పల్లిలో బస్సులున్నాయి. వీటికి తగినంతా మంది డ్రైవర్లు లేకపోవడంతోనే అధికంగా డ్యూటీలు వేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కాగా కొన్ని డిపోల్లో డ్రైవర్లకు నిత్యం డ్యూటీలు వేసినప్పటికీ డిపోలో సెక్రటరీ విభాగం ఉంటుంది. వీరు ఆ డ్రైవర్ ఎప్పటి నుంచి డ్యూటీకి వస్తున్నాడని గమనించి.. ఒకవేళ డ్యూటీ చేసుకుంటే మరునాడు ఆపేయాల్సి ఉంటుంది. కానీ వారు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల జగిత్యాల డిపోలో ఓ డ్రైవర్‌కు వరుసగా 9 రోజుల పాటు డ్యూటీలు వేసినట్లు తెలిసింది. జిల్లాలోని కొన్ని డిపోల పరిధిలో డ్రైవర్లకు ఒకరోజు డ్యూటీచేస్తే మరో రోజు విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా వరుసగా డ్యూటీలు వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో నిద్రలేక, ప్రశాంతత లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్లక్ష్యపు ప్రమాదాలతో చాలా మంది అమాయకులు చనిపోవడంతో పాటు, వారి కుటుంబాల్లో తెలియని క్షోభ నెలకొంటోంది.
గుంతలతో అత్యధిక ప్రమాదాలు
జిల్లాలో కరీంనగర్ రూట్‌లో, పెద్దపల్లి, ధర్మారం, నిజామాబాద్ రూట్లలో డబుల్‌రోడ్లు, హైవేలు ఉన్నప్పటికీ డ్రైవర్లు అత్యధిక స్పీడ్‌తో వస్తున్నారు. మధ్యమధ్య రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఉండటంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల డ్రైవర్లు వాటిని తప్పించే ప్రయత్నం చేయడంతో ఆకస్మికంగా ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణాలు గాలిలో పోతున్నాయి. ఈ రోడ్లలో గుంతలకు మరమ్మతు చేయకపోవడం, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు గానీ, అధికారులు గానీ పట్టించుకుని చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు.
నిర్లక్ష్యం అధికమే
సురక్షిత ప్రయాణమే లక్ష్యం
రోడ్లు సాఫీగా ఉండటం, కొందరు
ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఉండటం, అతివేగంగా నడపడంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్ చేపడుతున్నప్పటికీ చాలా మంది మద్యం సేవించి వాహనాల ను అతివేగంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి డ్రైవర్లకు ఓవర్ డ్యూటీలు వేయకపోవడంతో పాటు రహదారుల్లో ఉన్న గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
ఓవర్ డ్యూటీలు వేయం. 8 గంటలు, 12 గంటలు సమయాన్ని బట్టి వేస్తాం. డ్రైవర్ల కొరత లేదు. అవుట్‌సోర్సింగ్ పద్ధతిన డ్రైవర్లను నియమించుకుంటున్నాం. ప్రయాణికులను సురక్షితంగా తీసుకెళ్లడమే మా ధ్యేయం. డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వం.
– కల్పన, జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్
ప్రమాదాలు పొంచి..
ప్రమాదాలు పొంచి..


