ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం | - | Sakshi
Sakshi News home page

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం

Nov 5 2025 7:43 AM | Updated on Nov 5 2025 7:43 AM

ఇరుకు

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం

● పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి మెట్‌పల్లి మండలం నుంచే కాకుండా మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, నిజామాబాద్‌ జిల్లాలోని కమ్మర్‌పల్లి మండలాల నుంచి రోగులు వస్తుంటారు. ● ప్రతిరోజు ఎంతలేదనుకున్నా సుమారు 300మంది దాకా రోగులకు ఇందులో ఓపీ సేవలు అందుతున్నాయి. ● ఈ ఓపీ సేవల్లో గైనిక్‌ మినహా మిగతా వాటి కోసం గతంలో ప్రత్యేక భవనం ఉండేది. అందులో పలు గదులు ఉండడం వల్ల వైద్యసేవలకు ఇబ్బంది కలిగేది కాదు. ● ఆసుపత్రి నూతన భవన నిర్మాణం కోసం దానిని తొలగించిన అధికారులు.. అక్కడ అందించే ఓపీ సేవలను ప్రధాన ఆసుపత్రి భవనంలోకి మార్చారు. ● ఇందులో వైద్య సేవలకు రెండు గదులను మాత్రమే కేటాయించారు. ఇరుకుగా ఉండే వీటిలో ఓ గదిలో ఐదుగురు, మరో గదిలో ముగ్గురు చొప్పున వైద్యులు పక్కపక్కనే కూర్చోని రోగులను పరీక్షిస్తున్నారు. ● ఫలితంగా ఆశించిన విధంగా వైద్య సేవలు అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు గదుల్లో 8 మంది డాక్టర్ల పరీక్షలు సరైన వైద్యం అందడం లేదంటున్న రోగులు మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి

మెట్‌పల్లి: మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవల విషయంలో వైద్యులు, రోగులు నానా అవస్థలు పడుతున్నారు. గదుల కొరతతో వై ద్యులంతా ఒక్కచోటనే కూర్చోని రోగులను పరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్య పరిష్కారం కోసం అక్కడే నూతన భవన నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ.. ఆ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. దీనివల్ల వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెండు గదుల్లో ఎనిమిది మంది వైద్యుల సేవలు

ఈ చిత్రం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలోనిది. ఒకటే గది.. అది కూడా ఇరుకుగా ఉంది. అందులోనే ముగ్గురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని రోగులను పరీక్షిస్తున్నారు. వీరితోపాటు కొంతమందికి రక్త పరీక్షలను కూడా ఈ గదిలోనే నిర్వ

హిస్తుండడం గమనార్హం.

ఆసుపత్రిలోని మరో గది ఇది.

ఇందులో కూడా ఐదుగురు వైద్యులు పక్కపక్కనే కూర్చోని ఇదిగో ఇలా.. రోగులను పరీక్షిస్తున్నారు. అంతమంది వైద్యులు ఉన్నా.. గదిలో రోగులు కూర్చునేందుకు మాత్రం కనీసం కుర్చో.. లేకుంటే స్టూల్‌ వేసే అవకాశమే లేదు. ఫలితంగా రోగులను నిలబెట్టే పరీక్షించి పంపుతున్నారు.

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం1
1/2

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం2
2/2

ఇరుకు గదుల్లో వైద్యం.. ఇదేమి చోద్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement