ఫీజు బకాయిలు చెల్లించండి
జగిత్యాల: ఫీజు బకాయిలు చెల్లించాలని జిల్లాకేంద్రంలో ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలలు మంగళవారం ఆందోళనకు దిగాయి. అధ్యాపకులు తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లుగా నయాపైసా రాలేదని, యాజమాన్యాలు అధ్యాపకులకు వేతనాలు చెల్లిస్తూ నెట్టుకొస్తున్నారని తెలిపారు. ఫీజు బకాయిలు ఇవ్వాలని కోరారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. వీరికి జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు, యాజమాన్యాల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నాయకులు ప్రవీణ్, గంగాధర్, వేణు, పెండెం గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


