అదృశ్యమైన వృద్ధుడు శవమై...
కోనరావుపేట(వేములవాడ): నాలుగురోజుల క్రితం అదృశ్యమైన వృద్ధుడు శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన బద్దెపూరి నారాయణ (80) కొంతకాలంగా మానసికస్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్నాడు. అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. ఈ నెల 3న కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారాయణ గతంలో కూడా ఇంటినుంచి వెళ్లిపోగా నిజామాబాద్ గ్రామ శివారులో దొరికాడు. కాగా మంగళవారం ఉదయం మల్కపేట రిజర్వాయర్‌లో నారాయణ మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


