జగిత్యాలక్రైం/మల్యాల: విధి నిర్వహణలో వారు ఎప్పుడూ ముందున్నారు. తమ సర్వీసులో ఏనాడూ మచ్చ కూడా ఎరగరు. వారి సేవలను గుర్తించిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనేక పతకాలు అందించింది. తాజాగా ప్రతిషాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడల్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. జగిత్యాల స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై రాజేశుని శ్రీనివాస్, మల్యాల పోలీస్‌స్టేషన్ ఏఎస్సై రుద్ర కృష్ణకుమార్‌కు మెడల్ ప్రకటించింది. రాజేశుని శ్రీనివాస్ 1989లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2019లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2012లో రాష్ట్ర పోలీసు సేవా పథకం, 2019లో ఉత్తమ సేవా పథకం అందుకున్నారు. 36ఏళ్లుగా పోలీస్ పోలీసు శాఖకు చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక చేసింది. అలాగే రుద్ర కృష్ణ కుమార్ 1989లో కానిస్టేబుల్‌గా పోలీసుశాఖలో చేరారు. 2017లో హెడ్‌కానిస్టేబుల్‌గా.. 2021లో ఏఎస్సైగా పదోన్నతి పొందారు. 2022లో రాష్ట్ర పోలీసు సేవా పథకానికి ఎంపికయ్యారు. 36 ఏళ్లుగా చేస్తున్న సేవలను గుర్తించి ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపిక చేశారు. ఇద్దరిని జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు. కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రాజేశుని శ్రీనివాస్
రుద్ర కృష్ణకుమార్
ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఇద్దరు ఏఎస్సైలు
సేవలకు దక్కిన గౌరవం