
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
జగిత్యాల: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌లో సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగిస్తే 14446కు సంప్రదించాలన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ లత, డీఈవో రాము పాల్గొన్నారు.
కొండగట్టులో డాగ్ స్క్వాడ్ తనిఖీలు
మల్యాల: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీం తనిఖీలు నిర్వహించారు. భద్రతా చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు స్పష్టం చేశారు. ఎస్పీ అశోక్‌కుమార్ భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా తనిఖీలు చేపట్టామని ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు. ఆలయ ప్రధాన ద్వారం, మండపాలు, భక్తుల ప్రవేశ ద్వారం, పార్కింగ్ స్థలాలు, వసతి గృహాలు, ఆలయ పరిసరాలు, భక్తుల రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు కనపడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర సమయాల్లో డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు.
‘మత్తు’ నివారణలో భాగస్వామ్యం కావాలి
జగిత్యాలక్రైం: మత్తు పదార్థాలపై వ్యతిరేక పోరాటం వ్యక్తిగత బాధ్యతతోపాటు సామాజిక కర్తవ్యంగా భావించాలని ఎస్పీ అశోక్ కు మార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో మాద క ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ‘మత్తు పదార్థాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీల భాగస్వామి అవుతా నని, డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ.. నాతోపాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగో లు, అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారా న్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామి అవుతా’నని ప్రతిజ్ఞ చేయించారు. ఏవో శశికళ, డీసీఆర్బీ, ఎస్బీ, ఐటీకోర్ సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, రఫిక్ ఖాన్, ఆర్‌ఐలు కిరణ్ కుమార్, సైదులు, ఇతర పోలీసు అధికారులు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి
● మాజీ ఎంపీ మధుయాష్కీ
మెట్‌పల్లి: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ఆమో దం కోసం రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వ కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా కేంద్రం అడ్డు తగులుతోందన్నారు. రాజకీయాలకతీతంగా దీని ఆమోదం కోసం ఎంపీలంతా ఐక్యంగా ఉద్యమించాలన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ తెలంగాణను అన్ని విధాలుగా దోపిడీ చేసిందన్నారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, నాయకులు కృష్ణారావు, జెట్టి లింగం, తిప్పిరెడ్డి అంజిరెడ్డి తదితరులున్నారు.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి