
అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలి
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● జిల్లాకేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ
జగిత్యాలటౌన్: బహుజనులు అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ముందుగా మంత్రికి స్థానిక ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ బైపాస్‌రోడ్‌లోని గొల్లపల్లి కూడలిని సర్వాయి పాపన్న జంక్షన్‌గా నామకరణం చేశామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ రమణ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు ఉన్నారు. అనంతరం మాజీ మంత్రి జీవన్‌రెడ్డి సోదరుడి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
జగిత్యాలకు తరలివచ్చిన మంత్రులు
సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణ, జీవన్‌రెడ్డి సోదరుని కూతురు వివాహానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు జగిత్యాల వచ్చారు. వీరిలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్, మాజీమంత్రి రాజేశంగౌడ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, బీజేపీ నాయకురాలు భోగ శ్రావణి ఉన్నారు.
పాపన్న అందరికీ ఆదర్శం
సర్వాయి పాపన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు ఉన్నారు.

అధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలి