
పంద్రాగస్టు ఏర్పాట్ల పరిశీలన
జగిత్యాల/జగిత్యాలక్రైం: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలతో తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజారవాణా కేంద్రాలు, సమావేశ ప్రాంగణాలు, ముఖ్య రహదారులు, వంతెనలు, పబ్లిక్ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అపరిచితులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్, డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ముందుగా కలెక్టర్ సత్యప్రసాద్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, మున్సిపల్ కమిషనర్ స్పందన ఉన్నారు.