
ఎరువుల పంపిణీలో నిబంధనలు తప్పనిసరి
ఇబ్రహీంపట్నం: ఎరువుల పంపిణీలో నిబంధనలు పాటించాలని డీఏవో భాస్కర్ అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, ఈ పాస్‌లోఎరువుల అమ్మకాలను పరిశీలించా రు. అవసరం మేరకే యూరియాను విక్రయించాలని, ఏ రైతుకూ ఎక్కువ విక్రయించొద్దని తెలిపారు. ఏవో రాజ్‌కుమార్, సొసైటీ సీఈవో మంత్రి సతీష్‌కుమార్, ఆగ్రోస్ యజమాని ఆమెటి కృష్ణ పాల్గొన్నారు.
మహిళలను సంఘాల్లో చేర్చండి
జగిత్యాల/జగిత్యాలజోన్: అర్హులైన మహిళల ను సంఘాల్లో చేర్చాలని డీఆర్డీఏ పీడీ రఘువరణ్ అన్నారు. కలెక్టరేట్‌లో మహిళాసంఘాలతో సమావేశమయ్యారు. కొత్తగా వృద్ధులు, దివ్యాంగుల, బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈనెల 14 నుంచి అవగాహన కల్పించాలన్నారు. 30లోపు సంఘాలు ఏర్పాటు చేసి బ్యాంక్‌ల్లో ఖాతాలు తీసి రుణాలు ఇప్పించాలని సూచించారు.