
ఒకే ఇల్లు.. ఒకే వంట
బలం..బలగం
● ఇంటిపెద్ద మాటకు కట్టుబడి
● బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ
● ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలు
ఉమ్మడి కుటుంబమంటే కొండంత బలం. ఏ ఆపదొ చ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మేమున్నామనే భరోసా ఉంటుంది.. ప్రస్తుత ఉరుకులు పరుగు ల జీవితంలో బంధాలు, బంధుత్వాలు భారమవుతున్నాయి. పెళ్లయిన కొన్నాళ్లకే వేరుకుంపటి వ్యవస్థ పె రుగుతోంది. ఎప్పుడో ఓసారి కలిసినప్పుడు నామమాత్రపు పలకరింపులు.. తర్వాత ఎవరిదారి వారి దే.. అయినా కొన్ని కుటుంబాలు ఉమ్మడిగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇంటి పెద్దల మాటకు కట్టుబడి, విభేదాలు లేకుండా కలిసిమెలిసి ఉంటున్నారు. ఉమ్మడి కుటుంబమే కొండంత అండా అన్నట్టు ఆదర్శంగా నిలుస్తున్నారు.
– కోరుట్ల/సారంగాపూర్/యైటింక్లయిన్‌కాలనీ/ వేములవాడ/ముత్తారం/మల్యాల
ఉప్పుల జాయింట్ ఫ్యామిలీ
వారిది నిరుపేద వైశ్య కుటుంబం. అయినా బంధాలు, బంధుత్వాలను గౌరవిస్తారు. ముందునుంచి హోటల్ నడుపుకుంటూ జీవించే వసుధైక కుటుంబం. ప్రస్తుతం టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. పెంకుటింట్లో ఇరుకై న గదుల్లోనే వీరంతా ఉంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని ముదిరాజ్‌వీధిలో ఉంటున్న ఉప్పుల శ్రీరాములు– జయలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. కొడుకులు, కోడళ్లు కలిసే ఉంటున్నారు. ఇందులో శ్రీరాములు ఇటీవలే మరణించారు. వీరితోపాటు ఇద్దరు కూతుళ్లు ఇక్కడే ఉంటున్నారు. మిగతా ఐదుగురు కూతుళ్లు తమతమ అత్తావారిళ్లలో ఉంటున్నారు. ఈ ఉమ్మడి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఈ ప్రాంతానికే ఆదర్శంగా నిలుస్తున్నారు.
సమష్టి కృషి
నాకు 13 ఏళ్లకే పెళ్లయింది. నలుగురు కొడుకులు, ఏడుగురు కూతుళ్లు. అందరికీ పెళ్లిళ్లు చేశా ం. ఇప్పటి వరకు ఉమ్మడిగానే ఉంటున్నాం. కుటుంబ సభ్యులమంతా సమష్టిగా కృషి చే స్తూ కాలం వెల్లదీస్తున్నాం. చిన్నపాటి ఇళ్లయినా అనురాగాలు, ఆప్యాయతల మధ్య సంతో షంగా గడుపుతున్నాం. ఇప్పటికీ నా కొడుకులు, కోడళ్లు మా మాటను జవదాటరు. ఉమ్మ డి కుటుంబంతో ఎన్నో లాభాలు ఉంటాయి. కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అల్లుళ్లు, మనువలు, మనుమరాళ్లు, మునిమనువలు మొత్తం 44 మంది అయ్యాం. కానీ, నేటి తరం పెళ్లి కా గానే తల్లిదండ్రులను పట్టించుకోకుండా వేరు సంసారాలు పెడుతున్నారు. ఇది మన సంప్రదాయం కాదు.
– ఉప్పుల జయలక్ష్మి, కుటుంబ పెద్ద

ఒకే ఇల్లు.. ఒకే వంట

ఒకే ఇల్లు.. ఒకే వంట

ఒకే ఇల్లు.. ఒకే వంట