కరీంనగర్ కల్చరల్: మానవాళిని ముందుకు నడిపించే శక్తి కవిత్వానికి ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నగరంలోని జ్యోతిబాపూలే మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలం నుంచి కవిత్వం ఉద్భవిస్తుందన్నారు. కవితలకు సందర్భోచితమైన చిత్రాలను గీసి అన్నవరం శ్రీనివాస్, గుండు రమణయ్య, అన్నవరం దేవేందర్ మన్ననలు పొందారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సీవీక ుమార్, కవులు గాజోజు నాగభూషణం, దామరకుంట శంకరయ్య, కందుకూరి అంజయ్య, కె.మహేందర్‌రాజు, మరిపల్లి మహేందర్, కూకట్ల తిరుపతి, విలాసాగరం రవీందర్ పాల్గొన్నారు.