‘పుర’ రిజర్వేషన్లు ఖరారు
జగిత్యాల: బల్దియాల్లో రొటేషన్ ప్రతిపాదికన రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అధికారులు కార్యచరణ రూపొందించారు. ఈనేపథ్యంలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని రిజర్వు చేయాలన్న దానిపై ఉత్తర్వులు జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా, బీసీ డెడికేషన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బీసీలకు కేటాయించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులు ఉండగా ఐదు ఎస్టీ, 13 ఎస్సీ, బీసీలకు 49, జనరల్ మహిళ 38, అన్‌రిజర్వ్‌డ్ 31 కేటాయించారు. అయితే కలెక్టర్ సత్యప్రసాద్ ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ కేటాయించాలన్న దానిపై అధికారులతో కసరత్తు చేస్తున్నారు. శనివారం వార్డుల రిజర్వేషన్లు సైతం ప్రకటించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రిజర్వేషన్లపై ఎదురుచూపులు
బల్దియాలో ఎవరికెన్ని అనేవి రిజర్వేషన్లు ఖరారైనప్పటికీ ఏ వార్డుకు ఏ రిజర్వేషన్ వస్తుందా? అని ఆశావహులు ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్ అనుకూలిస్తుందా? లేదా? అన్నది ఆందోళన చెందుతున్నారు. మహిళలకు 50శాతం కేటాయించనున్న నేపథ్యంలో ఒకవేళ రిజర్వేషన్ పురుషులకు అనుకూలించకపోతే సతులను నియమించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే వార్డుల్లో ప్రచారం సైతం చేపడుతున్నారు.
టికెట్ల కోసం ప్రయత్నం
వార్డుల్లో తీవ్రమైన పోటీ నెలకొంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, బీఆర్‌ఎస్ ఎలాగైనా మున్సిపాలిటీలో పాగా వేయాలన్న ఉద్దేశంతో గెలుపు గుర్రాల కో సం చూస్తుండగా.. టికెట్ల కోసం ఆశావహులు సైత ం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా దక్కించుకోవాలని ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా రు. జిల్లాలో గతంలో అత్యధిక మున్సిపల్ చైర్మన్ సీట్లు బీఆర్‌ఎస్ కై వసం చేసుకోగా ఈసారి ఎలాగైనా కాంగ్రెస్, బీజేపీలు పుర సీట్లను కై వసం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు వార్డుల్లో సర్వే సైతం చేస్తున్నారు. ఒక్కో వార్డులో ముగ్గురు చొప్పున ముగ్గురు అభ్యర్థులను ఎన్నుకుని వారిపై సర్వే చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బలమైన అభ్యర్థికే టికెట్లు దక్కనున్నా యి. ఒకవేళ టికెట్లు దక్కకపోతే ఇండిపెండెంట్లుగా చాలా మంది బరిలో దిగే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వం రిజర్వేషన్లు రెండు పర్యాయాలు కొనసాగించాలని జీవో జారీ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ నిబంధనలు తొలగించడంతో ఈసారి జరిగే మున్సిపల్ ఎన్నికల్లో రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో అవకాశాలు వస్తాయని చాలా మంది భావిస్తున్నారు. గతంలో ఎస్సీ కోటాలో ఉన్న వార్డులో తొలగించి ఈసారి వేరే వార్డుకు కేటాయించే అవకాశం ఉంటు ంది. అలాగే అత్యధికంగా ఎస్సీ జనాభా ఉన్న వారు ్డను గుర్తించి వారికి కేటాయిస్తారు. కొన్ని వార్డులను డ్రా పద్ధతిలో కేటాయించే అవకాశం ఉంటుంది.
ఆశావహుల సందడి
ఒకవైపు ఓటరు ముసాయిదా ప్రకటించడంతో పాటు, మున్సిపల్‌లో వర్గాల వారీగా రిజర్వేషన్లు సైతం మున్సిపల్ శాఖ ప్రకటించడంతో ఇక ఆశావహుల్లో సందడి నెలకొంది. ఒక దశలో వారే లెక్కలు వేసుకుంటూ ఈసారి అనుకూలిస్తుందన్న భావంతో వార్డుల్లో ప్రచారం సైతం చేపడుతున్నారు. ఒకవేళ అనుకూలించకపోతే సతితో వేయించి ఎలాగైనా కౌన్సిలర్ సీటును కై వసం చేసుకోవాలని భావిస్తున్నారు.
‘పుర’ రిజర్వేషన్లు ఖరారు


