‘ఇందిరమ్మ’ ఇళ్లను త్వరిగా పూర్తిచేయాలి
ధర్మపురి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ధర్మపురిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రగతిని శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలన్నారు. బిల్లుల విషయంలో లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చూసుకుంటుందని, మూడు విడతల్లో మొత్తం బిల్లులు మంజూరు చేస్తుందని తెలిపారు. అనంతరం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎస్సీ, బీసీ కాలనీలో, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సౌకర్యాలు కల్పించాలని సూచించారు.


