జాతర ఆహ్వాన పత్రిక అందజేత | - | Sakshi
Sakshi News home page

జాతర ఆహ్వాన పత్రిక అందజేత

Jan 17 2026 8:54 AM | Updated on Jan 17 2026 8:54 AM

జాతర

జాతర ఆహ్వాన పత్రిక అందజేత

జగిత్యాలరూరల్‌: బీర్‌పూర్‌ లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవ జాతర ఆహ్వాన పత్రికను శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ జాతర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ జిల్లా డైరెక్టర్‌ రాంచందర్‌రావు, ఆలయ చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచులు హరీశ్‌, సృజన, సుశీల్‌, శ్రీలత, రాజ్‌కుమార్‌, మారుతి, వినోద, లక్ష్మణ్‌, ఈవో శ్రీనివాస్‌, ఉపసర్పంచ్‌ జితేందర్‌, ఆలయ కమిటీ సభ్యులు యశోద రమేశ్‌, గుమ్మడి రమేశ్‌, సురేందర్‌, సత్యనారాయణ, లక్ష్మణ్‌, సతీశ్‌, జగన్‌, సత్యం, జూనియర్‌ అసిస్టెంట్‌ రఘు పాల్గొన్నారు.

సీఎం కప్‌ పోటీలు విజయవంతం చేయాలి

కోరుట్ల/కోరుట్ల రూరల్‌: ఈనెల 17నుంచి ప్రారంభమయ్యే సీఎం కప్‌ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి కోరుకంటి విజయ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కోరుట్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులతో టార్చ్‌ ర్యాలీ నిర్వహించారు. సీఎం కప్‌ పోటీల్లో విద్యార్థులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఓదెల రామకృష్ణ, ఎంఈవో గంగుల నరేశం, ఎస్సై రాంచంద్రం, పేట జిల్లా ప్రెసిడెంట్‌ విశ్వప్రసాద్‌, సెక్రటరీ అశోక్‌, డీవైఎస్‌వో రవికుమార్‌, రాజు, అశోక్‌, సంజీవ్‌, రాజేశ్‌, నీలి శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

90 శాతం తోటల్లో మామిడి పూత

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలోని 90 శాతం మామడి తోటల్లో పూత వచ్చినట్లు జిల్లా ఉద్యానశాఖాధికారి శ్యాంప్రసాద్‌ చెప్పారు. శుక్రవారం జగిత్యాలరూరల్‌ మండలంలోని మోరపల్లి, చల్‌గల్‌ గ్రామాల్లోని మామిడి తోటలను శుక్రవారం పరిశీలించారు. గతంలో పోల్చితే ఈఏడాది తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని, వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. మామిడి తోటల్లో ఫలదీకరణ కోసం తేనేటీగలను పెంచాలని కోరారు. పూత సమయంలో పెద్దగా పురుగుమందులు పిచికారీ చేయొద్దని అన్నారు. మామిడి రైతులకు ప్రూట్‌ కవర్లను సబ్సిడీపై ఇస్తున్నట్లు తెలిపారు. హెచ్‌ఈవో అనిల్‌కుమార్‌, రైతులు పాల్గొన్నారు.

రాయికల్‌లో

కాషాయ జెండా ఎగరేస్తాం

రాయికల్‌: రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో రాయికల్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బోగ శ్రావణి అన్నారు. శుక్రవారం రాయికల్‌లో బీజేపీ ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాయికల్‌ మున్సిపాలిటీగా ఏర్పడి ఆరేళ్లు గడిచినప్పటికీ వీధిదీపాలు, తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, మాదిగ కుంట దుర్వాసనతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతూ రోగాల బారిన పడుతున్నారని అన్నారు. ఐకమత్యంగా ఉంటూ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుర్మ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మీ, నాయకులు మచ్చనారాయణ, కూనారపు భూమేశ్‌, కడార్ల శ్రీనివాస్‌, వాసం రమ, సంజీవ్‌, సామల్ల సతీశ్‌, పల్లె నర్సయ్య, బోడుగం శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

జాతర ఆహ్వాన పత్రిక   అందజేత1
1/3

జాతర ఆహ్వాన పత్రిక అందజేత

జాతర ఆహ్వాన పత్రిక   అందజేత2
2/3

జాతర ఆహ్వాన పత్రిక అందజేత

జాతర ఆహ్వాన పత్రిక   అందజేత3
3/3

జాతర ఆహ్వాన పత్రిక అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement