పోరుమల్ల–జోగినిపల్లికి రోడ్డు మంజూరుకు కృషి
రాయికల్: పోరుమల్ల నుంచి జోగినిపల్లికి రోడ్డు మంజూరుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం రాయికల్ మండలం మైతాపూర్‌లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ తలారి నాగమణి, ఉప సర్పంచ్ ప్రణయ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, గ్రామ నాయకులు భాష, శివానందరెడ్డి, స్వామి, లింగంపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.
జీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
జగిత్యాలటౌన్: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రా విడెంట్ ఫండ్ ఏర్పాటుతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు. గ్రామపంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం రూ. 277కోట్ల నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్త ం చేస్తూ జీపీ కార్మికుల భవిష్యత్‌కు భరోసా కల్పించాలని శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.


