బీప్‌: ప్రియుడికి పంపాల్సిన మెసెజ్‌ లెక్చరర్‌కు..

Young Girl Sends Xrated Message To Lecturer Mistakenly - Sakshi

వాషింగ్టన్‌ : ప్రియుడికి పంపాల్సిన ప్రైవేట్‌ మెసెజ్‌ను పొరపాటున కాలేజ్‌ లెక్చరర్‌కు పంపిందో యువతి. కొద్ది సేపటి తర్వాత తన పొరపాటు తెలుసుకున్న ఆమె సిగ్గుతో తల దించుకుంది. సదరు లెక్చరర్‌కు క్షమాపణ చెప్పుకుంది. తన ఈ ఇబ్బందికర పరిస్థితిని పేరు వెల్లడించకుండా రెడ్డిట్‌ అనే సోషల్‌ మీడియా వేదికలో పంచుకుంది. ‘‘ ప్రతీ మంగళవారం కాలేజీ ముగిసిన తర్వాత దగ్గరలోని బుక్‌ స్టోర్‌కు వెళ్లటం నాకు అలవాటు. గత కొద్దిరోజులనుంచి నేనక్కడ గూగుల్‌ ప్లేలో ఓ రొమాంటిక్‌ పుస్తకం చదువుతున్నాను. అన్ని రొమాంటిక్‌ పుస్తకాల కవర్‌ పేజీలాగే దాని కవర్‌ పేజీ కూడా షర్టులేని అబ్బాయి.. బికినీతో ఉన్న అమ్మాయితో ఉంది. నేను ఆ పుస్తకాన్ని చదువుతుండగా నా బాయ్‌ ఫ్రెండ్‌ చూశాడు. దాన్ని అ‍ప్పటికే చదవటం పూర్తి చేసిన అతడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఆ స్టోరీలో హీరో హీరోయిన్‌కు మధ్య జరిగే రొమాంటిక్‌ సీన్‌లో ఓ డైలాగ్‌ ఉంటుంది. ఆ డైలాగ్‌ను నేను గుర్తుపెట్టుకున్నాను.

మరుసటి రోజు షాపింగ్‌కు వెళ్లిన నేను ఓ బుక్‌ స్టోర్‌లో.. ఆన్‌లైన్‌లో చదువుతున్న ఆ పుస్తకాన్ని చూశాను. ఆ వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని సెల్ఫీ దిగాను. నేను గుర్తుపెట్టుకున్న స్టోరీలోని రొమాంటిక్‌ సీన్‌లోని డైలాగ్‌ను జత చేసి.. సెల్ఫీ ఫొటోను నా బాయ్‌ఫ్రెండ్‌కు పంపాను. అయితే, ఇక్కడే ఓ పెద్ద పొరపాటు జరిగింది. నేను నా బాయ్‌ ఫ్రెండ్‌కు పంపాల్సిన మెసెజ్‌ను అదే పేరుతో ఉన్న నా సైకాలజీ లెక్చరర్‌కు పంపాను. దీంతో సిగ్గుతో చచ్చిపోయాను. ఆయన మాత్రం ఏమీ స్పందించలేదు. నేను ఆయనకు క్షమాపణ చెబుతూ మెసెజ్‌ పెట్టాను. మరుసటి రోజు సమాధానం ఇచ్చాడు. నాపై చాలా సీరియస్‌ అయ్యాడు. ఆ తర్వాతి నుంచి ఆయన మా క్లాసులోకి వస్తే ఇబ్బందిగా ఫీలవుతున్నాను’’ అని వివరించింది.

చదవండి : Alzheimer: అల్జీమర్సా ..ఈ వీడియో చూస్తే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top