గుడ్‌న్యూస్‌! ఇక వారానికి నాలుగు రోజులే ఆఫీస్‌.. ఉద్యోగులు ఫుల్ ఖుష్.!

World Biggest Trial Four Day Working Week Declares Success - Sakshi

లండన్‌: ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని బ్రిటన్ చేపట్టిన అతిపెద్ద ట్రయల్‌లో ఆశాజనక ఫలితాలు వచ్చాయి. వివిధ రంగాలకు చెందిన 61 కంపెనీలు 6 నెలల పాటు నిర్వహించిన ఈ పైలట్‌ స్కీమ్‌లో పాల్గొన్నాయి. గతేడాది జూన్‌ నుంచి డిసెంబర్ వరకు ఈ ట్రయల్ జరిగింది. ఇందులో మొత్తం 3,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వారానికి ఐదు రోజులు పనిచేసినప్పుడు ఎంత జీతం ఇచ్చారో.. నాలుగు రోజులు పనిచేసినా అంతే మొత్తాన్ని చెల్లించారు.

చిన్న పెద్ద కంపెనీలు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఈ ప్రయోగంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్లు చెప్పాయి. ట్రయల్‌లో పాల్గొన్న 91 శాతం కంపెనీలు ఈ విధానాన్నే తాము కొనసాగిస్తామని చెప్పాయి.  4 శాతం సంస్థలు కాస్త సందిగ్ధత వ్యక్తం చేయగా.. మరో 4 శాతం కంపెనీలు తాము పాత పద్ధతినే(ఐదు రోజుల పనిదినాలు) కొనసాగిస్తామని స్పష్టం చేశాయి.

35 శాతం పెరిగిన రెవెన్యూ..
వారానికి నాలుగు రోజుల పనిదినాల అనుభవంపై కంపెనీలు 10 పాయింట్లకు సగటున 8.5 రేటింగ్ ఇచ్చాయి. బిజినెస్ ప్రొడక్టివిటీ, బిజెనెస్ పర్ఫామెన్స్‌కు 7.5 రేటింగ్ ఇచ్చాయి.  ఈ విధానం వల్ల గతేడాదితో పాల్చితే రెవెన్యూ 35 శాతం పెరిగిందని సంస్థలు వెల్లడించాయి. కొత్త నియామకాలు పెరిగాయని, ఆఫీసులకు గైర్హాజరు శాతం తగ్గిందని పేర్కొన్నాయి.

ఉద్యోగులకు సంతృప్తి..
నాలుగు రోజుల పనిదినాల వల్ల ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడిందని ట్రయల్‌లో తేలింది. చాలా మంది వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించారని, ఉద్యోగ సంతృప్తిలో గణనీయమైన పెరుగుదల కన్పించిందని వెల్లడైంది.  అలాగే ఉద్యోగులకు ఒత్తిడి, అలసట, నిద్ర సమస్యలు కూడా తగ్గాయి. పర్యావరణ ఫలితాలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నాలుగు రోజులే పనిదినాలు కాడవంతో ఆపీస్‌కు వెళ్లే సమయంతో పాటు వాహనాల వినియోగం కూడా తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతోంది.

మహిళలకే ఎక్కువ బెనిఫిట్..
ఈ కొత్త విధానం వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువగా మేలు జరుగుతున్నట్లు ట్రయల్‌లో తేలింది. ఇంటి పనులు, పిల్లలను చూసుకునేందుకు పురుషులు సమయం కేటాయించడంతో మహిళలకు ఆ భారం తగ్గినట్లు వెల్లడైంది. వారానికే నాలుగు రోజుల పనిదినాలు విధానాన్ని భవిష్యత్తులో తాము ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటున్నట్లు '4 డే వీక్ గ్లోబల్' స్వచ్ఛంద సంస్థ సహవ్యవస్థాపకులు, ఎండీ, చార్లోటె లాక్‌హార్ట్ చెప్పారు.
చదవండి: 'రెచ్చిపోతున్న కిమ్‌.. మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం..'

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top