Watch: Woman Carries Lion In Arms Internet Calls Her Wonder Woman, Video Goes Viral - Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియో.. అవలీలగా సింహాన్ని చేతుల్తో మోసుకెళ్లిన మహిళ..

Jan 13 2023 4:13 PM | Updated on Jan 13 2023 6:55 PM

Woman Carries Lion In Arms Must Watch Viral Video - Sakshi

అడవి జంతువులను చూస్తే సాధారణంగా ఎవరికైనా భయం వేస్తోంది.దాని కంటపడితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం.అడవికే రాజు అయిన సింహాన్ని చూసి ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు ప్రమాదకరమైనది. చాలా శక్తివంతమైనవి. నచ్చిన జంతువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో అవి దిట్ట.  అంతటి  క్రూరమైన సింహాన్ని ఓ మహిళ ఎలాంటి బెరుకు లేకుండా చేతుల్తో మోసుకొని వెళ్లింది.

వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా దీనికి సంబంధించిన వీడియోను యానిమల్స్‌ పవర్స్‌ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 10 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మహిళ తన రెండు చేతులతో బలవంతంగా సింహాన్ని ఎత్తుకొని వీధిలో నడుస్తూ కనిపించింది. ఆమె చేతిలో నుంచి సింహం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా మహిళ ఇంకాస్తా గట్టిగా దాన్ని పట్టుకొని తీసుకెళ్లింది.

అయితే ఇది పాత వీడియో కాగా ప్రస్తుతం మరోసారి నెట్టింట్టా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మహిళ తెగవను ప్రశంసిస్తూ వండర్‌ వుమెన్‌ అని కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు.. ‘అది పిల్లి, కుక్క కాదు సింహం.. దానితో కాస్తా జాగ్రత్తగా వ్యహరించండి’ అంటూ సలహా ఇస్తున్నారు. కాగా ఈ సంఘటన కువైట్‌ వీధుల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సింహాం మహిళ పెంపుడు జంతువని.. కువైట్‌ సిటీలో తప్పించుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement