ఈఫిల్‌ను రాత్రిపూట ఫొటో తీయాలంటే పర్మిషన్‌ కావాలి.. | Sakshi
Sakshi News home page

ఈఫిల్‌ను రాత్రిపూట ఫొటో తీయాలంటే పర్మిషన్‌ కావాలి..

Published Thu, Sep 8 2022 9:20 AM

Why its Illegal to Take Pictures of the Eiffel Tower at Night - Sakshi

పారిస్‌ వెళ్లినవాళ్లెవ్వరైనా ఈఫిల్‌ టవర్‌ దగ్గరకు వెళ్లకుండా ఉండరు. అందులోనూ రాత్రిపూట పారిస్‌ వెలుగుల్లో ఈఫిల్‌ టవర్‌ అందాన్ని ఆస్వాదించడం అద్భుతమైన అనుభవం. అయితే పగలైనా రాత్రైనా సాధారణ వ్యక్తులు ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. రాత్రిపూట ఈఫిల్‌ అందాలను పట్టి బంధించడానికి వీల్లేదు. పొద్దంతా తీసిందొక లెక్క... రాత్రిపూట తీసిందో లెక్క అంటున్నారు నిర్వాహకులు.

సాధారణ సందర్శకులు ఫోన్స్‌లోనూ, కెమెరాల్లోనూ ఫొటోలు తీసుకుంటే ఓకే. కానీ.. ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ రాత్రిపూట ఫొటోస్‌ తీయడానికి మాత్రం పర్మిషన్‌ తీసుకోవాలి. ఎందుకంటే రాత్రిపూట వెలిగే లైట్స్‌పై కాపీ రైట్‌ ఉందన్నమాట. పబ్లిష్‌ చేయడానికైనా, సర్క్యులేట్‌ చేయడానికైనా ప్రొఫెషనల్స్‌ ఈఫిల్‌ టవర్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాలని toureiffel. paris పేర్కొంది. ఈఫిల్‌ టవర్‌పై రోజూ 20వేల బల్బులు కాంతులీనుతాయి. టవర్‌పైన ఉన్న దీపస్థంభం అయితే మరింత ప్రత్యేకమైనది.  

చదవండి: (Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు)

Advertisement
Advertisement