లోయలో పడ్డ కుక్క.. చిరు తిండితో ఆశ చూపించి!

Viral: Dog Rscued From 30 Feet Deep Sinkhole, With Help Of Snack - Sakshi

సాటి మనిషి కష్టాల్లో ఉంటే అయ్యో పాపం అనే మనసు అందరికి ఉంటుంది. కానీ సాయం చేసే మంచి మనసు చాలా అరుదు. పక్కనున్న వారినే పట్టించుకోవడంలేని నేటి సమాజంలో ప్రాణం పోయే స్థితిలో ఉన్న కుక్కను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓవ్యక్తి. అయితే ఆ వ్యక్తి కుక్కను రక్షించిన విధానం తెలిస్తే నవ్వు ఆపుకోలేరు. వివరాలు.. కొందరు సభ్యులతో కూడిన బృందం నార్త్‌ కరోలినా ప్రాంతంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో పక్కన ఉన్న లోయలో ఓ కుక్క పడిపోయి ఉండటాన్ని గమనించారు. దాదాపు 30 అడుగుల లోతు ఉన్న లోయలో కుక్క చిక్కుకొని చాలా రోజులవుతున్నట్లు తెలుస్తోంది. (వైరల్‌: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది)

అయితే దానిని బయటకు తీసేందుకు ఆలోచించిన బైకర్లు వెంటనే సహాయం కోసం బుర్కే కౌంటీ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాన్ని పిలిచారు. అనంతరం వారంతా కుక్క చిక్కుకున్న లోయ వద్దకు వెళ్లి దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆక‌లితో ఉన్న కుక్క‌కు ఆహారం చూపిస్తే ఉత్సాహంతో ప‌రుగులు పెడుతుంది అనుకొని స్క్యూవ‌ర్స్ లోయ లోప‌లికి వెళ్లి కుక్కకు మాంసం, స్నాక్స్ ప్యాకెట్స్‌ చూపించారు. త‌ర్వాత జీను సాయంతో దానిని సురక్షితంగా బ‌య‌ట‌కు తీశారు. కుక్కు ఎలాంటి గాయాలు కాలేదని, అయితే చాలా రోజుల నుంచి ఆకలితో ఆలమటిస్తుందని వారు తెలిపారు. కుక్క‌ను ర‌క్షించిన విధానాన్ని రెస్క్యూవ‌ర్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ కుక్క‌కు సింక‌ర్ అని పేరు పెట్టారు. దీని య‌జ‌మానులు దొర‌క్క‌పోతే ఎవ‌రైనా కుక్క‌ను ద‌త్త‌త తీసుకోవ‌చ్చు అని అధికారులు తెలిపారు. (ఆ సూట్‌కేస్‌ను చూడకపోతే ఏం జరిగేది?)

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top