వైరల్‌: సామాజిక దూరం పాటిస్తున్న కుక్కపిల్ల

Dog Social Distancing Video Viral On Social Media - Sakshi

కొన్ని జంతువులు చేసే పనులు మనుషులను అశ్చర్యపరచడంతోపాటు ఆలోచింపజేస్తాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న కుక్కపిల్ల ఓ పార్కులో తెలివిగా చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ‘వెల్‌కమ్‌ టూ నేచర్’‌ అనే ట్వీటర్‌ ఖాతా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఈ చిన్న కుక్క పిల్ల చాలా సీరియస్‌గా సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ.. పార్క్‌లో తిరుగుతోంది’ అని కాప్షన్‌ జతచేసింది. ఇప్పటివరకు ఈ వీడియోను ఒక లక్ష మంది వీక్షించగా, 13 వేలమంది లైక్‌ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ వైరస్‌ నియంత్రణకు సామాజిక దూరం నిబంధన పాటించాలని ప్రజలకు ప్రభుత్వాలు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇటీవల కొంతమంది ఆకతాయిలు ఎటువంటి సామాజిక దూరం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన సంఘటనలను మనం చాలానే చూశాం. అయితే వైరస్‌పై ఎలాంటి అవగాహన లేని ఓ చిన్న కుక్క పిల్ల సామాజిక దూరం పటించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘క్యూట్‌ ఉన్న కుక్కపిల్ల చేస్తున్న పని చాలా గొప్పది’, ఆ కుక్క పిల్ల మనుషుల కంటే చాలా స్మార్ట్‌గా ఉంది. అలా ఉండటం దానికే మంచిది’’ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ కుక్కపిల్ల సామాజిక దూరం నిబంధనను పాటిస్తున్న తీరును చూస్తే మనుషులు కచ్చితంగా పాటిస్తారని చెప్పగలను’ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top