ఇంత పిచ్చేంటి బాబు.. ఖాళీ కవర్‌కి 5 లక్షలా.. అది కూడా పోటీ పడి!

Viral: Bag Of Air Sold For Over Rs 5 Lakh Its Specialty Will Blow Your Mind - Sakshi

సాధారణంగా వేలంలో కొన్నిసార్లు మామూలు వస్తువులు మన ఊహకందని రేట్లకు అమ్ముడై మనల్ని ఆశ్చర్యపరుస్తాయ్‌. ఒక్కోసారి విలువైన వ‌స్తువులు అనుకున్న దాని కంటే తక్కువ మొత్తానికి అమ్ముడవుతుంటాయ్‌.  తాజాగా ఓ ప్రాంతంలో ఏమీ లేని ఒక ప్లాస్టిక్ క‌వ‌ర్‌ వేలంలో 5 ల‌క్ష‌ల‌ ధర పలికింది. అది కూడా పోటి పడి అంత మొత్తానికి కొనడం చూస్తుంటే ఆశ్చర్యానికే ఆశ్చర్యం వేస్తుందేమో. ఈ వింత వేలం ఇటీవల అట్లాంటీస్‌ లో జరిగింది.

అసలు ఆ ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో కేవ‌లం గాలి మాత్ర‌మే ఉంది. మరి గాలికి ఎందుకంత అంత ఖర్చు పెట్టారో తెలుసుకుందాం రండి. ఆ గాలి.. డొండా డ్రాప్ అనే ఒక ఈవెంట్‌కు సంబంధించింది. డొండా డ్రాప్ అంటే అదేదో ప్రత్యేక ప్రదేశం నుంచి తెచ్చిన గాలి అనుకున్నారో పొరపాటే. అది ఒక క‌న్స‌ర్ట్‌కు సంబంధించిన ఈవెంట్ ద‌గ్గ‌ర నింపిన గాలి కవర్‌.  అమెరిక‌న్ ఫేమస్‌ పాప్ సింగ‌ర్, క‌న్యె వెస్ట్ తెలుసా? అమెరికాలో అతనికి క్రేజ్‌ మామూలుగా ఉండదు. డొండా అనే ఒక ఆల్బమ్‌ను ఈ సింగర్‌ త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నాడు.  దాని కోసం ప్రివ్యూ  క‌న్స‌ర్ట్‌ను అట్లాంటాలోని మెర్సిడిస్ బెంజ్ స్టేడియంలో ఏర్పాటు చేశాడు.

జులై 22న ఈ క‌న్స‌ర్ట్‌ను ఏర్పాటు చేయ‌గా.. ఓ వ్య‌క్తి ఆ కన్స‌ర్ట్‌కు వెళ్లి ఆక్క‌డ స్టేడియంలో గాలిని ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో నింపి దాన్ని ఈబేలో వేలం వేయగా.. దాన్ని కొనేందుకు జ‌నాలు ఎగ‌బడ్డారు. చివ‌ర‌కు ఆ కవర్‌ను ఓ అభిమాని 7600 డాలర్ల‌కు( రూ. 5లక్షలు) కొనుగోలు చేశాడు. ఇలాంటి అభిమానం చూసి ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top