Video: మెట్రోలో సీటు ఇవ్వ‌లేద‌ని.. యువ‌తిపై వృద్దుడి దౌర్జ‌న్యం | Video: china Man Hits Woman For Not Giving Him Seat in metro | Sakshi
Sakshi News home page

Video: మెట్రోలో సీటు ఇవ్వ‌లేద‌ని..యువ‌తిపై చేయి చేసుకున్న వృద్దుడు

Published Thu, Jul 4 2024 7:50 PM | Last Updated on Thu, Jul 4 2024 8:04 PM

Video: china Man Hits Woman For Not Giving Him Seat in metro

చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ యువ‌తి తన‌కు కూర్చోవ‌డానికి సీటు ఇవ్వ‌లేద‌న్న కోపంలో 50 ఏళ్ల  వృద్దుడు ఆమెపై క‌ర్ర‌తో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బీజింగ్ స‌బ్‌వేలైన్ 10లో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు త‌న కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువ‌తిని అడిగాడు. అయితే త‌న సీటును వెరొక‌రికి ఇస్తాను కానీ.. అత‌నికి మాత్రం ఇవ్వ‌న‌ని చెప్పింది. దీంతో ఆగ్ర‌హించిన వృద్ధుడు ఆమెపై అర‌వ‌డం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీద‌కు వ‌చ్చి ఆయ‌న చేతిలోని, క‌ర్ర‌తో  యువ‌తిని ఇబ్బంది పెట్టాడు. త‌న చేతుల‌తోనే ఆమె భుజం మీద కొట్టాడు. 

అక్క‌డితో ఆగ‌కుండా.. త‌న సీటు అడ‌గ‌డంలో త‌ప్పేముంద‌ని  చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భ‌యం లేదు అంటూ ద‌బాయించ‌డం వీడియోలో క‌నిపిస్తుంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘ‌ట‌న జూన్ 24 న జరిగిన‌ట్లు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement