135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత | Oldest person in China dies at 135 | Sakshi
Sakshi News home page

135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత

Dec 19 2021 6:29 AM | Updated on Dec 19 2021 6:30 AM

Oldest person in China dies at 135 - Sakshi

బీజింగ్‌: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్‌ సెయిటి(135) కన్నుమూశారని జిన్‌జియాంగ్‌ ఉయ్‌గుర్‌ అటానమస్‌ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్‌ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్‌ 1886 జూన్‌ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు.

2013లో చైనా అసోసియేషన్‌ ఆఫ్‌ గెరంటాలజీ, జీరియాట్రిక్స్‌ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్‌ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్‌కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement