breaking news
Alimihan Seyiti
-
135 ఏళ్ల చైనా వృద్ధురాలు కన్నుమూత
బీజింగ్: చైనాలోనే అత్యంత వృద్ధురాలైన అలిమిహాన్ సెయిటి(135) కన్నుమూశారని జిన్జియాంగ్ ఉయ్గుర్ అటానమస్ ప్రాంత అధికారులు శనివారం వెల్లడించారు. షులే కౌంటీలోని కొముక్జెరిక్ టౌన్‌షిప్‌నకు చెందిన అలిమిహాన్ 1886 జూన్ 25వ తేదీన జన్మించినట్లు కౌంటీ రికార్డుల్లో నమోదై ఉందని అధికారులు చెప్పారు. 2013లో చైనా అసోసియేషన్ ఆఫ్ గెరంటాలజీ, జీరియాట్రిక్స్ విభాగం జారీ చేసిన జీవించి ఉన్న అత్యంత వృద్ధుల జాబితాలో అలిమిహాన్ పేరు టాప్‌లో ఉన్నట్లు అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. గురువారం తుదిశ్వాస విడిచే వరకు ఆమె చాలా సాధారణమైన రోజువారీ జీవితం గడిపారని పేర్కొంది. వేళకు ఆహారం తీసుకుంటూ, తన ఇంటి పెరట్లో ఎండలో గడిపేవారని, మునిమనవలకు సాయం చేసే వారని తెలిపింది. కాగా, 90 ఏళ్లకు పైబడి ఉన్న వృద్ధులు ఎక్కువగా ఉండే పట్టణంగా కొముక్జెరిక్కు పేరుంది. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వం అందించే ఆరోగ్య పథకాలు కూడా ఇక్కడి వారికి దీర్ఘాయుష్షును అందిస్తున్నాయని జిన్హువా తెలిపింది. -
చైనాలో 117 ఏళ్ల వృద్ధురాలు మృతి
చైనాకు చెందిన అత్యంత వృద్ధురాలిగా రికార్డుకెక్కిన ఎర్జియూ(117) మంగళవారం మృతిచెందింది. జిగ్సింకి ప్రావిన్స్‌లోని వెన్సుయోలో 1898లో జన్మించిన ఎర్జియాకు ఆరుగురు సంతానం. ఆమెది సహజ మరణమని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. బియ్యంతో తయారయ్యే అల్కహాల్ను సొంతంగా చేసుకొని రోజూ తాగేదని, ఆదే ఆమె దీర్ఘాయుష్షుకు కారణమై ఉండొచ్చని స్థానికులు చెప్పారు.