వ్యాక్సిన్‌ షాట్‌: కుప్పకూలిన నర్సు : వీడియో వైరల్‌

US nurse faints after PfizerBioNTech COVID-19 vaccine shot - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ మహమ్మారిపై  వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం ఊరట కల్పిస్తోంది. అమెరికాలో ఫైజర్-బయోఎన్‌టెక్, మెడర్నా వ్యాక్సిన్లకు  రెగ్యులేటరీ అనుమతి లభించింది. అయితే క్లినికల్ ట్రయల్స్ నుండి సేకరించిన భద్రతా డేటాను విశ్లేషించిన తరువాత మాత్రమే  వ్యాక్సిన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించినప్పటికీ టీకాల భద్రత సమర్ధతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా టెనస్సీలోని ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ షాట్ అందుకున్న హెడ్ నర్సు టిఫనీ డోవర్ ప్రెస్ ప్రశ్నలకు సమాధానాలిస్తూ అకస్మాత్తుగా  అస్వస్థతకు గురైన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . దీంతో వ్యాక్సిన్‌ భద్రత, సమర్థతపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించింది. (వ్యాక్సిన్‌.. మీ ఇష్టమే) (టీకా భద్రత : బైడైన్‌ దంపతుల ​ముందడుగు)

టేనస్సీలోని సీహెచ్‌ఐ మెమోరియల్ హాస్పిటల్ ఎన్ చత్తనూగలో విలేకరుల సమావేశంలో టిఫనీ డోవర్  మాట్లాడుతూ, టీకా తీసుకోవడం సంతోషిస్తున్నానని ప్రకటించారు. తర్వాత విలేకరుల సమావేశంలోనే మూర్ఛపోవడం కలకలం రేపింది. ఈ దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. క్షమించండి, మైకం కమ్ముతోందంటూ ఆమె మూర్ఛపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు వైరల్‌ గామారింది.  అయితే  ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. (చదవండి : చైనాకు చెక్: ట్రంప్‌ మరో కీలక ఆర్డర్)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top