నైట్ క్లబ్‌లో కాల్పుల మోత.. ఐదుగురు మృతి.. 18 మందికి గాయాలు..

US Colorado gay club shooting Several Dead Many Injured - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కొలరడో స్ప్రింగ్స్‌లోని ఓ గే నైట్ క్లబ్‌లో సాయుధుడు తుపాకీతో రెచ్చిపోయాడు. కన్పించిన వారిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 18 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు కూడా వెళ్లాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి పాల్పడటానికి కారణమేంటనే విషయాలను వెల్లడించలేదు. అమెరికా మీడియా మాత్రం సాయుధుడు ఇంకా క్లబ్‌లోనే ఉన్నాడని, స్నైపర్‌తో కాల్పులు జరుపుతున్నాడని పేర్కొంది.

ఈ క్లబ్‌లో ప్రతిఏటా నవంబర్ 20న గే సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పదుల సంఖ్యలో స్వలింగ సంపర్కులు నైట్‌ క్లబ్‌కు వచ్చారు. అయితే సాయుధుడు ఒక్కసారిగా వీరిపై కాల్పులకు తెగబడ్డాడు.
చదవండి: 140 ఏళ్ల తర్వాత కన్పించిన అరుదైన పక్షి.. ఫొటో వైరల్..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top