కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స... చిగురిస్తున్న కొత్త ఆశ

Uruguays Tango Therapy A Hit With Dialysis Patients - Sakshi

సంగీతంతో చికిత్స అందిస్తారని మనం టీవీల్లోనూ లేదా సినిమాల్లోనూ విని ఉంటాం. నిజ జీవితంలో సంగీతంతో చికిత్స చేయడం గురించి వినటం అరుదు. మానసిక వ్యాధితో బాధపడుతున్నవాళ్లకు సంగీతంతో మార్పు తీసుకరావడం వంటివి చేస్తున్నారు. గానీ ఒక హాస్పటల్‌ పేషంట్ల కోసం ఏకంగా సంగీత కచేరీనే ఏర్పాటు చేసి చికిత్స అందించడం అంటే ఆశ్చర్యమే కదా. 

వివరాల్లోకెళ్తే..ఉరుగ్వేలో కిడ్ని రోగులకు సంగీతంతో చికిత్స అందిస్తున్నారు. మాంటెవీడియోలోని డయావెరమ్‌ క్లినిక్‌ కిడ్ని పేషంట్ల కోసం బ్యాండోనియన్ ప్లేయర్‌లు, గాయకులు,  గిటారిస్టులు చేత సంగీత కచేరిని ఏర్పాటు చేస్తోంది. ఆ సంగీత బృందం రోగులను క్లాసిక్ టాంగో పీస్ "నరంజో ఎన్ ఫ్లోర్ వంటి సంగీతాలతో అలరిస్తారు. వాస్తవానికి కిడ్ని పేషంట్ల డయాలసిస్‌ చేయించుకోవడమనేది విపరీతమైన బాధతో కూడుకున్న చికిత్స. పైగా వాళ్లు వారానికి మూడుసార్లు క్లినిక్‌కి వచ్చి డయాలసిస్‌ చేయించుకోక తప్పదు. తమకు ఏదో అయిపోయిందన్న భావనతో నిరాశ నిస్ప్రహలతో నీరశించి పోతుంటారు.

అలాంటి రోగులు ఈ సంగీత కచేరిని వింటూ... డయాలసిస్ చికిత్స తీసుకుంటారు. ఆ క్లినిక్‌లో ఉన్న రోగులంతా తాము ఇంతవరకు భయాందోళనలతో జీవతం మీద ఆశలేకుండా జీవచ్ఛవంలా బతుకుతున్నా మాకు ఈ సంగీతం మాకు కొత్త ఊపిరిని ఇస్తోందంటున్నారు. తాము రోజువారీ పనులు కూడా చేసుకునేందుకు ఆసక్తి కనబర్చలేకపోయాం. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలంటేనే భయపడే వాళ్లం అని చెబుతున్నారు.

ఇప్పుడు తమకు క్లినిక్‌ ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా మారిందని ఆనందంగా చెబుతున్నారు పేషంట్లు. ఆ ఆస్పత్రిని సంగీత బృందం స్పానిష్ మ్యూజిషియన్స్ ఫర్ హెల్త్ ఎన్జీవో నుంచి ప్రేరణ పొంది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అదీగాక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సంవత్సరాలుగా ఆరోగ్య వ్యవస్థల్లో కళా సంస్కృతిని చేర్చాలని సిఫార్సు చేసిందని అందుకే తాము డయాలసిస్ పేషెంట్లకు రెండు దశాబ్దాలుగా టాంగో సంగీతాన్ని అందిస్తున్నామని చెబుతోంది ఆ సంగీత బృందం.

 నెఫ్రాలజిస్ట్ గెరార్డో పెరెజ్ చొరవతోనే "హాస్పిటల్ టాంగో" అనే ప్రాజెక్ట్‌ ఏర్పాటైంది. ఇది ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో మినీ కచేరీలను నిర్వహిస్తుంది. అంతేగాదు సంగీతం వినడం వల్ల ఆందోళన ఒత్తిడి తగ్గుతుందని, హృదయ స్పందన స్థిరంగా ఉంటుందని శాస్త్రీయ పరిశోధనలు నిరూపితమైంది కూడా.

(చదవండి: కొడుకు టార్చర్‌ భరించలేక తల్లిదండ్రులు ఏం చేశారంటే.... ఇనుప గొలుసులతో బంధించి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top